Congress: ఇండియా కూటమికి షాక్.. పొత్తుకు ఈ పార్టీలు దూరం.. అసలు కారణం ఇదే..

దేశ రాజకీయాల్లో మార్పు కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి ఒక ప్రత్యమ్నాయ వేదికను కూడా రూపొందించింది. ఇండియా కూటమి అని పేరు పెట్టి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకు పోవాలని భావించింది. అయితే ఈ మధ్య కాలంలో ఇండియా కూటమికి బలమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Congress: ఇండియా కూటమికి షాక్.. పొత్తుకు ఈ పార్టీలు దూరం.. అసలు కారణం ఇదే..
India Alliance
Follow us

|

Updated on: Feb 11, 2024 | 9:00 AM

దేశ రాజకీయాల్లో మార్పు కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి ఒక ప్రత్యమ్నాయ వేదికను కూడా రూపొందించింది. ఇండియా కూటమి అని పేరు పెట్టి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకు పోవాలని భావించింది. అయితే ఈ మధ్య కాలంలో ఇండియా కూటమికి బలమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పెద్ద దిక్కుగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కాంగ్రెస్‎తో విభేదించారు. అదే క్రమంలో నిన్న ఆప్ కూడా ఇండియా అలయన్స్‎కు దూరం అంటూ ప్రకటన చేసింది. దీంతో ఇండియా కూటమికి పార్టీలు వరుసగా షాక్‌ మీద షాక్ తగులుతున్నాయి. తాజాగా పంజాబ్ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేస్తామని స్ఫష్టం చేశారు సీఎం భగవంత్ మాన్. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇండియా కూటమికి ఆమ్‌ఆద్మీ పార్టీ సైతం షాక్ ఇచ్చింది. పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని.. 13 ఎంపీ సీట్లతో పాటు చండీఘడ్‌ లోక్‌సభ స్థానానికి కూడా ఆప్‌ ఒంటరిగా పోటీ చేస్తుందన్నాని చెప్పారు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌. ఇండియా కూటమితో తమకు సంబంధం లేదని.. కేజ్రీవాల్‌ సమక్షంలోనే మాన్‌ ఈవ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. అంతే కాకుండా గతంలో కూడా ఇండియా కూటమికి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తము పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. దీనికి అసలైన కారణం సీట్ల సర్ధుబాటుపై స్ఫష్టత రాకపోవడమే అనే అభిప్రాయం వినిపిస్తోంది.

పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌. ఖన్నాలో ఉచిత రేషన్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ హాజరయ్యారు. 70 ఏళ్ల పాటు పంజాబ్‌ జరిగిన అన్యాయాన్ని ఆప్‌ ప్రభుత్వం సరిచేసిందన్నారు కేజ్రీవాల్‌. త్వరలోనే 14 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. 14 స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో ఇండియా కూటమి ఆందోళనలో పడింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ సమక్షంలో పంజాబ్ సీఎం చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు గోవా, హర్యానా, గుజరాత్‌లలోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించేందుకు ఫిబ్రవరి 13న ఆప్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఒకవైపు రాహుల్ భారత్ జోడో యాత్ర సాగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రీ అలియన్స్ అయితే ఉండదని స్పష్టం చేస్తున్న పార్టీలు.. ప్రో అలయన్స్ తో ముందుకు సాగుతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.