Viral Video: పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్.. వారిని పని మనుషులుగా ట్రీట్ చేస్తోంది. అంతగా ఏం కష్టం చేసిందో ఏమో గానీ.. పిల్లలో మసాజ్ చేయించుకుంది. అయితే, ఈ సీన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. అమ్మగారికి షాక్ తగిలింది. సదరు ఉపాధ్యాయురాలిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు.
వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలలోని పోఖారీ ప్రైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు ఊర్మిలా సింగ్.. స్కూల్ విద్యార్థులతో కాళ్లు, చేతులు నొక్కించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదికాస్తా ఉన్నతాధికారుల కంట పడటంతో వారు సీరియస్ అయ్యారు. జిల్లా ఉన్నత విద్యాధికారులు.. సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
हरदोई के स्कूल में मासूम बच्चे से टीचर द्वारा हाथ दबवाने और सेवा करवाने का मामला सामने आया है. #BSA ने विडीओ को संज्ञान लेकर किया सस्पेंड.#Hardoi #Videoviral pic.twitter.com/kD1TwqgBP7
— Mayank Tiwari (@imayanktiwari) July 27, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..