అరుదుగానే కరోనా మళ్లీ సోకుతుంది: ఐసీఎంఆర్

కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ సోకడం చాలా అరుదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు. హాంకాంగ్‌లో రెండోసారి

అరుదుగానే కరోనా మళ్లీ సోకుతుంది: ఐసీఎంఆర్
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2020 | 7:34 AM

Coronavirus reinfected cases: కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ సోకడం చాలా అరుదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు. హాంకాంగ్‌లో రెండోసారి వస్తోన్న కరోనా విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోలుకున్న వారికి తిరిగి వైరస్ సోకుతున్న కేసులు వస్తున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక రష్యా తయారుచేసిన వ్యాక్సిన్ ఇంకా మూడో దశ పూర్తి కాలేదని అన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వలన 76 మంది శరీరంలో యాండీబాడీలు పెరిగినట్లు లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైందని అన్నారు. మరోవైపు ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అందరికంటే రికవరీలు మన దేశంలోనే ఉన్నాయని చెప్పారు.

కాగా దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో  83,809 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 49,30,236కు చేరుకుంది. వీరిలో 38,59,399 మంది కోలుకోగా..  80,776 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,90,061 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More:

రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌.. విద్యార్థులకు మార్గదర్శకాలివే