Viral Video: ఇంటి అటకపై నుంచి అదో మాదిరి శబ్ధాలు.. ఏంటా అని చూడగా..

|

Sep 05, 2024 | 2:16 PM

అది కనిపిస్తే ఎంతటి వాళ్లైనా గజగజ వణకి పోవాల్సింది. ఆ స్నేక్ చేసే చప్పుడు వింటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అరుదుగా కనిపించే ఆ పాము పేరు వినడమే తప్ప ఎక్కువగా కనిపించవు. కాని ఎంచక్కా ఓ ఇంటి బెడ్ రూమ్‌తో తిష్ట వేసింది.

Viral Video: ఇంటి అటకపై నుంచి అదో మాదిరి శబ్ధాలు.. ఏంటా అని చూడగా..
King Cobra
Follow us on

ఇంటి బెడ్రూమ్‌లో మీతోపాటు ఓ భారీ కింగ్‌కోబ్రా నివశిస్తుంటే ఫీలింగ్‌ ఎలా ఉంటుంది? ఇంటి అటకపై 9 అడుగుల రాచనాగు బుసలు కొడుతుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందా? ఇప్పుడు మీరు దిగువన చూడబోతున్న వీడియో కర్నాటకలోనిది. ఆ రాష్ట్రంలోని అగుంబి అనే గ్రామంలోని ఓ ఇంట్లో కనిపించింది ఈ రాచనాగు. దీన్ని చూసిన ఇంటి వారు ఒక్కసారిగా భయాందోళనలకు గురై.. దగ్గర్లోని స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. దీంతో తాము వచ్చేవరకు ఏం చేయాలో.. వద్దో వివరించాడు స్నేక్‌ క్యాచర్‌ అజయ్‌ గిరి. తనతో సామాగ్రిని తెచ్చుకుని ఆ కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా బంధించాడు. ఆ రాచనాగును ఊరి అవతల ఉన్న అటవీ ప్రాంతంలో వదిలాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

భారీ పొడవు ఉన్న గిరినాగును పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం.. గిరినాగును సమీపంలోని అడవుల్లోకి విడిచిపెట్టారు స్నేక్‌ క్యాచర్. ఇక.. ఈ గిరినాగు.. దాదాపు 15 నుంచి 16 అడుగుల పొడవు ఉంటుందని, దానికి తగ్గట్టుగానే సుమారు 10 కిలోల వరకు బరువు ఉండొచ్చన్నారు అటవీ శాఖ అధికారులు. జతకట్టే సీజన్ కావడంతో తరచూ గిరినాగులు బయటకు వస్తున్నాయంటున్నారు. సర్పజాతిలో భిన్నమైన ఈ గిరినాగులు.. ఎక్కువగా దట్టమైన అడవుల్లోనే ఉంటుంటాయి.ఇది అత్యంత విషమైన పాము అని…కాటు వేస్తే 75 శాతానికి పైగా మనిషి చనిపోయే అవకాశం ఉందన్నారు. దట్టమైన అటవీ, సెలయేరు ప్రవాహ ప్రాంతాలు వీటి జీవనానికి అనుకూలంగా ఉంటాయని ఫారెస్టు అధికారులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..