కోల్కతా కాళీ అలంకరణకు భారీ బడ్జెట్.. !

ఓ పక్క దేశమంతా.. ఆర్థిక మాంద్యంతో మందగిస్తుంటే.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వాసులు మాత్రం దుర్గామాతా అలంకరణల కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో కోల్‌కతాలోని పూజా కమిటీలు ఈ ఉత్సవాల కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. దుర్గా నవరాత్రుల్ని ఆ రాష్ట్రంలో ఘనంగా జరుపనున్న నేపథ్యంలో కోల్‌కతాలోని బౌబజార్‌కు చెందిన ‘ సంతోష్ మిత్రా స్క్వేర్ ’ దుర్గా పూజ నిర్వాహకులు దుర్గా దేవిని, ఆమె సింహం మరియు మహిషాసురలను […]

కోల్కతా కాళీ అలంకరణకు భారీ బడ్జెట్.. !
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 11:55 AM

ఓ పక్క దేశమంతా.. ఆర్థిక మాంద్యంతో మందగిస్తుంటే.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వాసులు మాత్రం దుర్గామాతా అలంకరణల కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో కోల్‌కతాలోని పూజా కమిటీలు ఈ ఉత్సవాల కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాయి.

దుర్గా నవరాత్రుల్ని ఆ రాష్ట్రంలో ఘనంగా జరుపనున్న నేపథ్యంలో కోల్‌కతాలోని బౌబజార్‌కు చెందిన ‘ సంతోష్ మిత్రా స్క్వేర్ ’ దుర్గా పూజ నిర్వాహకులు దుర్గా దేవిని, ఆమె సింహం మరియు మహిషాసురలను అలంకరించడానికి ఏకంగా 50 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. బంగారం ధర రూ.40,000 లకు వరకూ ఉన్న క్రమంలో ఈ బంగారు అలంకరణ ఖరీదు సుమారు రూ.20 కోట్ల వరకూ ఉంది.

ఈ సంవత్సరం అత్యంత ఖరీదైన విగ్రహం ఇదేనని పూజా కమిటీ ప్రధాన శిల్పి తెలిపారు. 2017 దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఈ పూజా కమిటీ అమ్మవారిని బంగారు చీరతో అలంకరించింది. ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పాల్ రూపొందించిన ఈ బంగారు చీర ధర లక్షల పైచిలుకే.

గత కొన్నేళ్లుగా వివిధ పూజ కమిటీలు దేవతను అలంకరించడానికి విలువైన లోహాలను, రాళ్లను ఉపయోగిస్తున్నాయి. దుర్గాదేవి విగ్రహాలను అలంకరించడానికి ఉపయోగించే విలువైన లోహాలు మరియు రాళ్ళు పవిత్రమైనవిగా భావిస్తారు. అమ్మవారికి అలంకరించిన చీరలను వివాహాల్లో, శుభకార్యాల్లో వినియోగిస్తారు. దాని వల్ల శుభం జరుగుతుందని వారి నమ్మకం.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో