Telugu News India News Holiday List 2026 Released: Offices To Remain Closed In India On These Dates, Check Complete Schedule
2026 Holidays List: ఉద్యోగులు, విద్యార్థుల గుడ్‌న్యూస్.. వచ్చే ఏడాది భారీగా సెలవులు.. జాబితా విడుదల
2026 Holidays List: కేంద్ర ప్రభుత్వం తన అన్ని కార్యాలయాలకు 2026 సంవత్సరానికి వర్తించే సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో జాతీయ సెలవుల నుండి వివిధ మతాలు, వర్గాల ముఖ్యమైన పండుగల వరకు అన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. జనవరి..
2026 Holidays List: విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలు ఎగిరిగంతులేస్తారు. ఇప్పుడు డిసెంబర్ నెల రానుంది. తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. వచ్చే కొత్త సంవత్సరాన్ని సరికొత్త ఆశలతో ప్రారంభించేందుకు ప్రతిఒక్కరూ సిద్దమవుతున్నారు. చాలా మందికి వచ్చే ఏడాదిలో రకరకాల డ్రిమ్స్ ఉంటాయి. ఇలాంటివారు పండగలు, ప్రత్యేక పర్వదినాలు, జాతీయ దినోత్సవాల్లో వచ్చే సెలవుల్లో ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు. అయితే వచ్చే ఏడాది 2026 సెలవుల జాబితా వచ్చేసింది. భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ india.gov.in లో కేంద్ర ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ 2026 చూడవచ్చు.
కేంద్ర ప్రభుత్వం తన అన్ని కార్యాలయాలకు 2026 సంవత్సరానికి వర్తించే సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో జాతీయ సెలవుల నుండి వివిధ మతాలు, వర్గాల ముఖ్యమైన పండుగల వరకు అన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తం సెలవులను పరిశీలించినట్లయితే 2026 సెలవుల క్యాలెండర్‌లో 14 తప్పనిసరి సెలవులు, 12 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. మరి కేంద్రం విడుదల చేసిన సెలవుల జాబితా గురించి తెలుసుకుందాం.