Heavy Rains: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం..

గోడ కూలి భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు మృతి చెందారని సోమవారం పోలీసు అధికారులు తెలిపారు. కాంకేర్ జిల్లాలోని పఖంజూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇర్పనార్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

Heavy Rains: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం..
death
Follow us

|

Updated on: Aug 15, 2022 | 4:35 PM

Chhattisgarh Heavy Rains: ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. గోడ కూలి భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు మృతి చెందారని సోమవారం పోలీసు అధికారులు తెలిపారు. కాంకేర్ జిల్లాలోని పఖంజూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇర్పనార్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రాత్రివేళ కుటుంబం మొత్తం ఇంట్లో నిద్రిస్తుండగా సోమవారం తెల్లవారుజామున మట్టి గోడ కూలిందని, దీంతో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు పడవలో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కంకేర్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రాంతంలోని నదులు, వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రధాన రహదారిపై పలు గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోయిందన్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే.. జబల్‌పూర్‌లోని ఖాయ్ మొహల్లాలో వంట చేస్తున్న వృద్ధురాలిపై అకస్మాత్తుగా ఇంటి గోడ కూలిపోవడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..