సుశాంత్ తండ్రితో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ భేటీ

| Edited By: Pardhasaradhi Peri

Aug 08, 2020 | 5:44 PM

సుశాంత్ తండ్రి కేకే ఖాన్ తో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ భేటీ అయ్యారు. ఫరీదాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో సుశాంత్ సోదరి రాణి సింగ్ కూడా పాల్గొన్నారు. తన సోదరుని మృతికి దారి  తీసిన పరిస్థితులను..

సుశాంత్ తండ్రితో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ భేటీ
Follow us on

సుశాంత్ తండ్రి కేకే ఖాన్ తో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ భేటీ అయ్యారు. ఫరీదాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో సుశాంత్ సోదరి రాణి సింగ్ కూడా పాల్గొన్నారు. తన సోదరుని మృతికి దారి  తీసిన పరిస్థితులను ఆమె ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. సుశాల్ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా ఖట్టర్ హామీ ఇచ్చారు. సుశాంత్ బావ ఓ.పి.సింగ్ ప్రస్తుతం ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు.

సుశాంత్ ప్రేమగా పెంచుకున్న పెట్ డాగ్ ‘ఫడ్జ్’ ఆలనా పాలనను ఆయనే చూసుకుంటున్నారు. కాగా-తమ అభిమాన నటుడి మృతిని హర్యానా వాసులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.  ఈ కేసులో సుశాంత్ ఫ్యామిలీకి న్యాయం జరగాలని,  ఆయనను హత్య చేశారని వార్తలు వస్తున్న తరుణంలో అసలు సూత్రధారులను అరెస్ట్ చేసి శిక్షించాలని వారు కోరుతున్నారు.