యూపీ ‘ఘాటు’..నడిరోడ్డులో క్యాబ్ డ్రైవర్ ను ‘ఉతికి ఆరేసిన’ యువతి..ఎందుకంటే..?

| Edited By: Anil kumar poka

Aug 01, 2021 | 8:22 PM

యూపీ ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూనే ఉంటోంది. ఆదివారం ఓ యువతి లక్నోలో క్యాబ్ డ్రైవర్ నొకరిని 'ఉతికి ఆరేసింది'.. అవధ్ రోడ్ క్రాసింగ్ వద్ద ఈ డ్రైవర్ ని దుర్భాషలాడుతూ ఎడాపెడా కొడుతూ వీరంగం సృష్టించింది.

యూపీ ఘాటు..నడిరోడ్డులో క్యాబ్ డ్రైవర్ ను ఉతికి ఆరేసిన యువతి..ఎందుకంటే..?
Girl Thrashes Taxi Driver In The Middle Of The Road In Up
Follow us on

యూపీ ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూనే ఉంటోంది. ఆదివారం ఓ యువతి లక్నోలో క్యాబ్ డ్రైవర్ నొకరిని ‘ఉతికి ఆరేసింది’.. అవధ్ రోడ్ క్రాసింగ్ వద్ద ఈ డ్రైవర్ ని దుర్భాషలాడుతూ ఎడాపెడా కొడుతూ వీరంగం సృష్టించింది. అతడి సెల్ ఫోన్ ని లాక్కుని విసిరి కొట్టింది. గొడవను నివారించడానికి మధ్యలో వచ్చిన వ్యక్తిపైనా, చివరికి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన కూడా చెయ్యి చేసుకునేంత పని చేసింది. దాంతో వాళ్ళు కూడా హడలిపోయారు. తనను అకారణంగా కొడుతోందని, మహిళా పోలీసులనెవరినైనా పిలవాలని,, ఈమె నుంచి తనను రక్షించాలని ఆ డ్రైవర్ మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. రోడ్డుపై మూగిన వారంతా ఇదేదో సినిమాలా చోద్యం చూస్తూ నిలబడ్డారు. అనేకమంది తమ సెల్ ఫోన్లలో వీడియో తీస్తూ బిజీ అయిపోయారు. ఆ లేడీ నుంచి ఆ డ్రైవర్ ను కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇంతకీ ఇతడిని ఎందుకు కొడుతున్నావని ప్రశ్నిస్తే.. అతడు తన వాహనంతో తనను ఢీ కొట్టాడని.. అయినా మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆమె దురుసుగా సమాధానమిచ్చింది.

కెమెరా ముందుకు వచ్చి ఆ డ్రైవర్.. తన తప్పేమీ లేదని చెబుతున్నా అతడి చొక్కా పట్టుకుని రోడ్డు మధ్యలోకి లాగి లెంపలు వాయిస్తూనే వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. చివరకు ఆ క్యాబ్ డ్రైవర్ ని ఆమె నుంచి ఎవరు కాపాడారన్నది మాత్రం తెలియలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్‌ పెట్టుకోలేదని..:Police attack Video.

 పోర్నోగ్రఫీ కేసులో తిరగబడిన శిల్పా శెట్టి..!మీడియాపై ఫైర్ అయినా హీరోయిన్..:Pornography case Video.

 చిరుతలతో దోస్తాన్ ఏంద్రా సామీ..!మూడు చిరుతలను హాగ్ చేసుకొని పడుకున్న వ్యక్తి..(వీడియో):Man with Cheeta video.

 పాతిపెట్టిన శవం.. ఎలా బయటకు వచ్చింది..?నడిరోడ్డుపై శవ పేటిక..:Buried corpse video.