Gaganyaan: గగన్ యాన్ లో కీలక అడుగు.. మరో మైలు రాయిని దాటిన ఇస్రో..

|

Aug 12, 2022 | 8:59 AM

గగన్ యాన్ సన్నాహాల్లో మరో కీలక అడుగు పడింది. అత్యవసర సమయంలో వ్యోమగాములను కాపాడే వ్యవస్థకు సంబంధించిన ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటర్ పరీక్ష విజయవంతమైంది. ఈ మోటార్‌ వల్లే క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ పనిచేస్తుంది. గగన్ యాన్ ప్రయోగం ప్రారంభ దశలో ఏదైనా

Gaganyaan: గగన్ యాన్ లో కీలక అడుగు.. మరో మైలు రాయిని దాటిన ఇస్రో..
Isro
Follow us on

Gaganyaan: గగన్ యాన్ సన్నాహాల్లో మరో కీలక అడుగు పడింది. అత్యవసర సమయంలో వ్యోమగాములను కాపాడే వ్యవస్థకు సంబంధించిన ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటర్ పరీక్ష విజయవంతమైంది. ఈ మోటార్‌ వల్లే క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ పనిచేస్తుంది. గగన్ యాన్ ప్రయోగం ప్రారంభ దశలో ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే వ్యోమగాములను సేఫ్‌గా బయటపడేచేందుకు ఈపరీక్ష దోహదపడతుంది. ప్రాజెక్టు లాంచ్‌ వెహికిల్‌ నుంచి ఆస్ట్రోనాట్స్‌ మాడ్యుల్‌ ఎజెక్ట్‌ అవడానికి ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష విజయవంతం కావడం ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్సాహాన్ని నింపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించింది. ఇటీవల ఇస్రో చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ తొలి ప్రయోగం విజయవంతం కాని విషయం తెలిసిందే. మూడేళ్ళుగా వాయిదాపడుతూ వచ్చిన ఈ SSLV ప్రయాణం చివరివరకూ బాగానే సాగి, నిర్ణీత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే టైమ్‌లో విఫలమైంది. ఈప్రయోగం విఫలం కావడంతో నిరాశలో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలకు ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటర్ పరీక్ష విజయవంతమవ్వడం గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.

గగన్ యాన్ ప్రాజెక్టలో వ్యోమగాముల రక్షణ అన్నింటికన్నా ముఖ్యమని ఇస్రో చీఫ్‌ సోంనాథ్‌ తెలిపారు. దీనిలో భాగంగా క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఈ సిస్టమ్‌ ఎలా పనిచేస్తోందనేది రెండు సార్లు పరీక్షిస్తామని చెప్పారు. గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు గగన్ యాన్ మిషన్ లోని క్రూ మాడ్యుల్ ను క్రూ ఎస్కేప్ మిషన్ వేరు చేస్తుంది. దీంతో వ్యోమగాములు సురక్షితంగా బయటపడతారు. అలాగే రాకెట్ ప్రారంభం దశలో మిషన్ ఆగిపోయిన సందర్భంలోనూ ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్… సీఎఈఎస్ కు అవసరమైన థ్రస్ట్ ను అందించనుంది. తక్కువ భూ కక్ష్యకు మానవ అంతరిక్ష యాత్రలను చేపట్టేందుకు స్వదేశీ సామర్థ్‌యాన్ని ప్రదర్శించేందుకు గగన్ యాన్ ప్రోగ్రామ్ ను ఇస్తరో చేపట్టబోతుంది. గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా మూడు విమానాలు లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపిస్తారు. వీటిలో రెండు మానవరహిత విమానాలు కాగా.. ఒకటి మానవ సహిత పయనం. గగన్ యాన్ ప్రాజెక్టు భారత మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర కాగా.. ఈమిషన్ లో భాగంగా తక్కవు భూ కక్ష్యలోకి మనుషులను పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి


మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..