ఇక నుంచి రైలులో ఫ్రీ ఫుడ్ అంటూ భారత రైల్వే సంస్థ స్పష్టం చేసింది. సాధారణంగా.. రైల్వేలో భోజనం బాగోదని, నాణ్యంగా ఉండదని ప్రయాణికులందరూ కంప్లైంట్స్ చేస్తూనే ఉంటారు. అందులోనూ ఫుడ్‌కి మించి ఎక్కువ ధరలను వసూలు చేస్తారని.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం శాఖ ఫిర్యాదులను కూడా తీసుకుంటూనే ఉంటుంది. అలాగే ఫుడ్ పార్శిల్ తీసుకునేటప్పుడు బిల్ కూడా ఇవ్వరు. బిల్లు కన్నా.. ఎక్కువగా ధరలు ఛార్జ్ చేస్తున్నారనేది కూడా రైల్వే ప్రయాణికుల ప్రధాన ఆరోపణ. అయితే.. బిల్లు కన్నా ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని.. భారతీయ రైల్వే అనేక సార్లు స్పష్టం చేసింది కూడా. అయినా కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు.
దీంతో ఈ సమస్యకు రైల్వే సంస్థ పరిష్కారం కనిపెట్టింది. ఇక నుంచి ‘నో బిల్-ద ఫుడ్ ఈజ్ ఫ్రీ’ అనే క్యాప్షన్‌తో ప్రయాణికుల్ని ఆకర్షిస్తోంది. దీని ఉద్ధేశ్యం ఏంటంటే.. ‘బిల్లు లేకపోతే.. భోజనం ఉచితం’. సాధారణంగా రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఆహార పదార్థాలను కొంటూ ఉంటారు. కానీ వారు బిల్లు మాత్రం ఇవ్వరు. ఇక నుంచి మీరు కొనే ఆహారానికి బిల్లును ఖచ్చితంగా తీసుకోవాలని.. ఇవ్వని పక్షంలో ఆ ఆహారాన్ని ఉచితంగా తీసుకోవచ్చని భారతీయ రైల్వే సంస్థ తాజాగా ట్వీట్ చేసింది. అయితే ఇది ఎంతవరకూ అమలవుతుందో చూడాలి.
In order to ensure caterers do not overcharge passengers in trains, #IndianRailways introduced a ‘No Bill-The food is free’ policy wherein passengers need not pay for the #food they are purchasing onboard if the vendor fails to furnish a bill. For details, visit: Website.
— IRCTC (@IRCTCofficial) February 27, 2020