Viral Video: వానకు రోడ్డుపైకొచ్చి ఈత కొట్టిన పెద్ద పెద్ద చేపలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

దక్షిణాదిన రుతుపవనాలు ప్రవేశించి నెలన్నర గడుస్తున్నా చుట్టం చూపు మాదిరి అప్పుడప్పుడు వచ్చిపోతూ దోబూచులాడుతున్నాయి వానలు.. కానీ ఉత్తరాదిన మాత్రం వాన యమ భీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తుతున్నాయి. కాలువలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు రోడ్లపై కొచ్చి ఈత కొడుతున్నాయి..

Viral Video: వానకు రోడ్డుపైకొచ్చి ఈత కొట్టిన పెద్ద పెద్ద చేపలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Fish Swimming On Flooded Roads

Updated on: Jul 20, 2025 | 7:19 PM

జైపూర్‌, జులై 20: దక్షణాదిన వానలు పొదుపుగా కురుస్తున్నాయి. రుతుపవనాలు ప్రవేశించి నెలన్నర గడుస్తున్నా చుట్టం చూపు మాదిరి అప్పుడప్పుడు వచ్చిపోతూ దోబూచులాడుతున్నాయి. కానీ ఉత్తరాదిన మాత్రం వాన యమ భీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తుతున్నాయి. కాలువలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు రోడ్లపై కొచ్చి ఈత కొడుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోనూ ఈ దృశ్యాలు కనిపించాయి. దీంతో స్థానికులు చేపలను పట్టుకునేందుకు రోడ్లపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

గత రెండు రోజులుగా రాజస్థాన్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగౌర్‌ జిల్లాలోని పలు ప్రాంతాలు, గ్రామాలు జలమయమయ్యాయి. నదులు, డ్రైనేజీలు, ఆనకట్టలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. భారీ వర్షాల దాటికి అక్కడ లంపోలై చెరువు పొంగిపొర్లింది. అందులోని నీరు రోడ్డపైకి రావడంతో చెరువులోని పెద్ద పెద్ద చేపలు రోడ్లపై భారీ సంఖ్యలో ఈదుతూ కనిపించాయి. దీంతో స్థానికులు వాటిని పట్టుకునేందుక రోడ్లపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కాగా, రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా అజ్మీర్, బుండి, పాలి, పుష్కర్, సవాయి మాధోపూర్ సహా అనేక నగరాల్లో వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా నదులు, డ్రెయిన్లు, ఆనకట్టలు పొంగి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని అనేక గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా జోధ్‌పూర్-జైపూర్ హైవేలోని బనాద్ రోడ్డు కూడా జలమయమైంది. దీంతో అనేక వాహనాలు రహదారిపై చిక్కుకుపోయాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జైపూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ రాధే శ్యామ్ శర్మ తెలిపారు. జూలై 27-28 తేదీల్లో తూర్పు రాజస్థాన్‌కు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.