Mamata Banerjee: సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.. కేంద్ర నిర్ణయంపై మమత మండిపాటు

|

Oct 25, 2021 | 6:48 PM

దేశ సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్(BSF) అధికార పరిధిని మరింత విస్తృతం చేస్తూ కేంద్ర హోం శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.

Mamata Banerjee: సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.. కేంద్ర నిర్ణయంపై మమత మండిపాటు
Mamata
Follow us on

దేశ సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్(BSF) అధికార పరిధిని మరింత విస్తృతం చేస్తూ కేంద్ర హోం శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దీంతో ఇకపై పంజాబ్‌, పశ్చిమ బెంల్​, అసోం రాష్ట్రాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 50 కి.మీ.వరకు లోపలకు వచ్చి బీఎస్ఎఫ్ దళాలు సోదాలు, జప్తులు చేయడం సహా అనుమానిత వ్యక్తులను అరెస్టు చేయవచ్చు. గతంలో ఇది 15 కి.మీ వరకు మాత్రమే ఉండేది. దేశ భద్రత బలోపేతానికి, డ్రగ్స్ అక్రమ రవాణాను నిలువరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. అయితే కేంద్రం హోం శాఖ తీసుకున్న నిర్ణయానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ  నిర్ణయం దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. బీఎస్ఎఫ్ ముసుగులో రాష్ట్రాల అధికారాల్లో చొరబాటుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో తమ అభ్యంతరాలను తెలియజేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ పంపినట్లు ఆమె తెలిపారు.

దేశ సరిహద్దుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవన్న మమతా బెనర్జీ.. పొరుగుదేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఈ విషయంలో ప్రజలను గందరగోళానికి గురిచేయాల్సిన అవసరం లేదన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశమన్నారు. తమ పరిధిలోని అంశాలపై బీఎస్ఎఫ్ దృష్టిసారించాలని, దీనికి తమ పూర్తి మద్ధతు ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్‌కు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. బీఎస్ఎఫ్ అధికార పరిధిని పెంచుతూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని మమతా బెనర్జీ కోరారు.

Also Read..

Pawan Kalyan: ఈ నెల 31న విశాఖకు పవన్ కళ్యాణ్.. పూర్తి వివరాలు

KTR: జలదృశ్యం నుండి సుజల సుఫల దృశ్యాల దాకా ప్రపంచం చూడని.. మహోన్నత పరివర్తనా ప్రస్థానమిది: కేటీఆర్