Rahul Gandhi: రాహుల్ గాంధీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన అధికారులు.. వీడియో

Rahul Gandhi: రాహుల్ గాంధీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన అధికారులు.. వీడియో

Balu Jajala

|

Updated on: Apr 15, 2024 | 1:45 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఎన్నికల అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రాహుల్ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్ లో బహిరంగ సభతో పాటు పలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వయనాడ్ నుంచి ఏప్రిల్ 26న జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఎన్నికల అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రాహుల్ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్ లో బహిరంగ సభతో పాటు పలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వయనాడ్ నుంచి ఏప్రిల్ 26న జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు.  బీజేపీ మేనిఫెస్ట్ పై నిప్పులు చెరుగుతూ మోడీపై విమర్శలకు దిగుతున్నారు.

కాగా రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం బిజెపి మేనిఫెస్టోను ప్రధాని మోడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే 400 సీట్ల లక్ష్యంతో ఇండియాలో మూడోసారి అధికారంలోకి వస్తామని తేల్చి చెప్పారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ధైర్యంగా ఉంటారని ఆయన అన్నారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఈ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలున్నాయి.

Published on: Apr 15, 2024 01:39 PM