‘ వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు’ ? వెంటనే తొలగించాలన్న ఈసీ  

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మలను వెంటనే స్టార్ ‘ప్రచార కర్తల’ జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ బీజేపీని ఆదేశించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గాను ఈ ఇద్దరినీ పార్టీ ఈ లిస్టులో చేర్చిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు వీరిని ఈ హోదా నుంచి తప్పించాలని ఈసీ కోరింది. ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ ప్రసంగాల్లో వీరు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు […]

' వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు' ? వెంటనే తొలగించాలన్న ఈసీ   
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 29, 2020 | 6:38 PM

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మలను వెంటనే స్టార్ ‘ప్రచార కర్తల’ జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ బీజేపీని ఆదేశించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గాను ఈ ఇద్దరినీ పార్టీ ఈ లిస్టులో చేర్చిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు వీరిని ఈ హోదా నుంచి తప్పించాలని ఈసీ కోరింది. ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ ప్రసంగాల్లో వీరు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27 న నిర్వహించిన ప్రచారంలో.. అనురాగ్ ఠాకూర్.. ఈ దేశ ద్రోహులపై కాల్పులు జరపాలని.. అంటూ అసభ్య వ్యాఖ్య చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని ఉద్దేశించి ఆయన ఈ ‘ పిలుపునిచ్చారు’. దీనిపై ఆ మరుసటిరోజే ఆయనకు ఈసీ నోటీసు జారీ చేసింది. ఇక బీజేపీ ఎంపీ పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ.. తన ప్రచారం సందర్భంగా..  షాహీన్ బాగ్ వద్ద ధర్నా చేస్తున్న సీఏఏ నిరసనకారులను ఉద్దేశించిఅతి నీచమైన కామెంట్లు చేశారు. ‘ వాళ్ళు మీ ఇళ్లలో ప్రవేశించి.. మీ సిస్టర్స్ ని, కూతుళ్లను రేప్ చేస్తారని, వారిని చంపేస్తారని’  అన్నారు. ప్రధాని మోడీ గానీ, హోం మంత్రి అమిత్ షా గానీ మిమ్మల్ని రక్షించడానికి రాబోరని కూడా అన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలపైఈసీ  మండిపడింది. అనురాగ్ ఠాకూర్, పర్వేష్ సాహెబ్  సింగ్ వర్మల ప్రసంగాలను వీడియోలతో సహా సమర్పించాలని ఢిల్లీ ఎన్నికల అధికారిని కోరింది. అటు-కొందరు కాంగ్రెస్ నేతలు కూడా వీరి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Latest Articles
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..