Earthquake: భూకంపంతో వణికిన జపాన్, జమ్మూ కాశ్మీర్.. భయాందోళనలో ప్రజలు!

Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. కాశ్మీర్ లోయ భూకంపాలు తరచుగా సంభవించే..

Earthquake: భూకంపంతో వణికిన జపాన్, జమ్మూ కాశ్మీర్.. భయాందోళనలో ప్రజలు!
Earthquake

Updated on: Nov 08, 2026 | 9:39 AM

Earthquake: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రతతో నమోదైంది. ఈరోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 5:23:19 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం బారాముల్లాలో, 34.261 ఉత్తర అక్షాంశం, 74.155 తూర్పు రేఖాంశం వద్ద ఉంది. భూకంపం సముద్ర మట్టానికి 20 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు నమోదైంది.

జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. కాశ్మీర్ లోయ భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు సంభవిస్తుంటాయి. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే భూకంపంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.

భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే, రాళ్లు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. భద్రతా చర్యగా, జపాన్ ప్రధాన హై-స్పీడ్ రైలు సర్వీసు అయిన షింకన్సెన్ రైళ్లు ప్రభావిత ప్రాంతాల్లో తక్కువ వేగంతో నడుస్తున్నాయి.

అదే సమయంలో భారీ భూకంపాలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతంగా పరిగణించే నాంకై ద్రోణి ప్రాంతంలో ఎటువంటి ముఖ్యమైన మార్పులు కనుగొనలేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశాలలో జపాన్ ఒకటి కావడంతో ఈ వరుస భూకంప హెచ్చరికలు దేశ ప్రజలలో భయాన్ని కలిగించాయి.

జపాన్‌లో..

ఇక జపాన్‌లో కూడా భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 5.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్‌ వాతావరణ శాఖ ధృవీకరించింది. ఈ భూకంపంతో కనీసం 22 మంది గాయపడ్డారు. అనేక దుకాణాల కిటికీలు పగిలిపోయాయి. బలమైన ప్రకంపనల కారణంగా ప్రజలు తమ ఇళ్లు, భవనాల నుండి పరుగులు తీశారు.

జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, భూకంప కేంద్రం షిజువోకా ప్రిఫెక్చర్‌లో భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఉండగా, అత్యంత బలమైన ప్రకంపనలు ఐచి ప్రిఫెక్చర్‌లో సంభవించాయి. నవంబర్ 1న 6 తీవ్రతతో నవంబర్ 7న 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపాల తర్వాత ఈ నెలలో జపాన్‌ను తాకిన మూడవ బలమైన భూకంపం ఇది. వచ్చే వారం పాటు భూకంపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాబోయే రెండు మూడు రోజుల్లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ ప్రజలను కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us