Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లోని పాంగిన్‌కు ఉత్తరాన 1174 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం ప్రకంపనలు సుమారు 09:51 నిమిషాలకు సంభవించాయి. మరోవైపు తమిళనాడులోని దిండిగల్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 1.2 నుంచి 1.5 మధ్య నమోదైంది. చెన్నైకి 464 కి.మీ దూరంలోని దిండిగల్ జిల్లాలోని ఓడంచత్రం సమీపంలో ప్రకంపనలు వచ్చాయి. NCFS వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 4:33 గంటలకు మొదటి ప్రకంపనలు వచ్చాయి (తీవ్రత 1.2). తరువాత రెండో ప్రకంపనలు సాయంత్రం 6.04 గంటలకు వచ్చాయి. మూడోది సాయంత్రం 6.07 గంటలకు ఏర్పడ్డాయి. ఈ రెండు ప్రకంపనల తీవ్రత 1.5. నమోదుకాగా భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. గ్రామంలోని కొంతమంది ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి.
మరోవైపు గుజరాత్‌లోని ద్వారక సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం గుజరాత్‌లోని ద్వారకకు పశ్చిమాన 556 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమై ఉంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.37 గంటలకు ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అంతేకాకుండా గురువారం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే అంశం.
An earthquake of magnitude 5.1 occurred around 21:51 hours at 1174km North of Pangin, Arunachal Pradesh: National Center for Seismology pic.twitter.com/K7KQB94dJS
— ANI (@ANI) March 25, 2022