మద్యం మత్తులో ఓ వ్యక్తి బతికున్న పామును నోటితో నమిలాడు. అక్రమణ ఇళ్లను రైల్వే అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్న ఆగ్రహంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్ అవుతోంది.
ఝార్ఖండ్‌లోని నైనీతాల్ జిల్లా లాల్కువాన్ రైల్వే స్టేషన్పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. అక్కడ నివాసం ఉంటున్న వారిని రైల్వే జిల్లా యంత్రాంగం అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. క్రెయిన్లతో అక్రమంగా కట్టిన ఇళ్లను తొలగిస్తున్నారు. ఈ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదుగానీ అక్కడికి ఓ పాము వచ్చింది. అక్రమ కట్టడాలు కూల్చివేత వల్ల కోపోధ్రిక్తుడైన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆ పాము నోటి భాగాన్ని నమిలేశాడు. చుట్టూ ఉన్నవారు వారిస్తున్నా వినిపించుకోవకుండా కసపిస నమిలేశాడు. ఐతే ఆ వ్యక్తికి పాము విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. అలా అది ఫారెస్ట్ అధికారుల కంట పడింది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ ఆఫీసర్ గౌలా రేంజ్ చందన్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తున్నారు. వన్యప్రాణులకు హాని తలపెట్టకూడదని ఆయన సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.