యూపీలో మాజీ పోలీసు అధికారి అమితాబ్ ఠాకూర్ ని పోలీసులు అరెస్టు చేసి వ్యాన్ లో ‘కుక్కేసిన’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించాలని, అంతవరకు తాను పోలీసు స్టేషన్ కు రాబోనని మొరాయిస్తున్న ఆయనను వారు బలవంతంగా వ్యాన్ లో ‘కుక్కారు’. లక్నోలోని తన నివాసం వద్దే అందరూ చూస్తుండగా ఈ హైడ్రామా చోటు చేసుకుంది. అయితే ఈ వీడియో చూసిన అనేక మంది ఖాకీల ‘అమానుషాన్ని’ దుయ్యబట్టారు. ఒక మాజీ పోలీసు అధికారిని ఇంత క్రూరంగా అరెస్టు చేస్తారా అని వారు దుయ్యబట్టారు. విధులు సరిగా నిర్వర్తించడం లేదంటూ హోమ్ శాఖ ఈయనను గత మార్చిలో బలవంతంగా తొలగించింది. యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం యోగి ఆదిత్య నాథ్ పైనే పోటీ చేస్తానని అమితాబ్ ఠాకూర్ లోగడ ప్రకటించాడు.అయితే ఈయన వ్యవహారంలో ఓ క్రైమ్ కోణం కూడా ఉంది. ఓ యువతిని, ఆమె స్నేహితుడిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణకూడా ఇతనిపై ఉంది. ఈ నెల 19 న ఢిల్లీలో సుప్రీంకోర్టు బయట ఈ యువతీ యువకులు తమ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. వారిని పోలీసులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మొదట ఆ యువకుడు.. ఆ తరువాత రెండు మూడు రోజులకే ఆ యువతి మరణించింది.
2019 లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎంపీ అతుల్ రాయ్ తనను రేప్ చేశాడని..ఆ తరువాత ఈ కేసులో తనను తీవ్రంగా వేధించిన ఆయన సహచరులు, కొంతమంది పోలీసు అధికారుల్లో ఈ అమితాబ్ ఠాకూర్ కూడా ఉన్నాడని ఆ యువతి తన మరణ వాంగ్మూలంలో తెలిపింది. దాంతో సూసైడ్ కి ప్రేరేపించాడన్న అభియోగాన్ని పోలీసులు ఇతనిపై మోపారు. ఇక ‘అధికార్ సేన’ అనే కొత్త పార్టీని పెడుతున్నానని, ఈ పార్టీ తరఫున తాను సీఎం యోగిపై పోటీ చేస్తానని అమితాబ్ ఠాకూర్ ఈ మధ్యే చెప్పాడు.
भूतपूर्व पुलिस के विरुद्ध भाजपा सरकार की पुलिस का अभूतपूर्व कार्य!
भाजपाई राजनीति लोगों के बीच दरार पैदा करके ही जिंदा है. अब भाजपा सरकार के दबाव के कारण पुलिस ही पुलिस के ख़िलाफ़ काम करने पर मजबूर है. एक सेनानिवृत आईपीएस के साथ ऐसा व्यवहार अक्षम्य है. #नहीं_चाहिए_भाजपा pic.twitter.com/o7OG4XRAMy
— Akhilesh Yadav (@yadavakhilesh) August 27, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: ఒళ్లుగగ్గుర్లు పొడిచే వీడియో ఇది..! మరిన్ని వైరల్ వార్తలపై స్పెషల్ వీడియో :Special All Viral Videos.
రెండు జంతు జాతుల స్నేహబంధం.. హిప్పోపై తాబేళ్లు ఫ్రీ రైడ్.. వీడియో వైరల్:Turtles on Hippo Back Video.
భార్య అంటే మరి ఇంత ప్రేమా..! భార్య చితిలోకి దూకి.. పతి సహగమనం చేసిన భర్త..:Viral Video.