Dowry: అందంగా లేని అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాల్సిందే.. పాఠ్యపుస్తకంలో సంచలన అంశాలు

|

Apr 04, 2022 | 5:46 PM

కట్నం(Dowry) ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చట్టరీత్యా నేరం. కానీ ఇప్పటికీ కట్నం లేకుండా పెళ్లిళ్లు జరగడం లేదు. బహిరంగంగా ఇవ్వకపోయినా కానుకల రూపంలో భారీగానే ముట్టజెప్తుతున్నారు. వరకట్నం సమాజంలో ఒక దుర్లక్షణంగా మారింది. అమ్మాయిల...

Dowry: అందంగా లేని అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాల్సిందే.. పాఠ్యపుస్తకంలో సంచలన అంశాలు
Bhopal Marriage
Follow us on

కట్నం(Dowry) ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చట్టరీత్యా నేరం. కానీ ఇప్పటికీ కట్నం లేకుండా పెళ్లిళ్లు జరగడం లేదు. బహిరంగంగా ఇవ్వకపోయినా కానుకల రూపంలో భారీగానే ముట్టజెప్తుతున్నారు. వరకట్నం సమాజంలో ఒక దుర్లక్షణంగా మారింది. అమ్మాయిల పెళ్లిళ్లు(Marriage) చేసేందుకు కట్న కానుకలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఫలితంగా ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇది ఇలా ఉంటే.. నర్సింగ్ విద్యార్థులకు బోధించాల్సిన పాఠ్యపుస్తకంలో కట్నం గురించి సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి. అందంగా లేని అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు కట్నం దోహదకారిగా ఉంటుందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సిలబస్(syllabus) పుస్తకంలో రాయడం సంచలనంగా మారింది. “వరకట్న వ్యవస్థ యోగ్యతలు, ప్రయోజనాల” జాబితాతో ఈ వివరాలు రాసి ఉండటం కలకలం రేపింది. ఈ పుస్తక పేజీ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి విషయాలను పాఠ్య ప్రణాళికలో ముద్రించడం వల్ల సమాజం చెడుదోవ పట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ పేజీ ఫొటోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్లు, వాహనాలు వంటి ఉపకరణాలతో నూతన కుటుంబాన్ని స్థాపించడంలో కట్నం సహాయకరంగా ఉంటుందని పుస్తకంలో పేర్కొనడం అవమానకరం అని మండిపడ్డారు. వరకట్న సమస్య అనేది దేశంలో అనాదిగా వస్తున్న అనాగరిక చర్య. దేశంలో చాలా కాలంగా నిషేధించినప్పటికీ రహస్యంగా కట్నాలు ఇవ్వడం, తీసుకోవడం జరుగుతూనే ఉన్నాయి.

వరకట్నం డిమాండ్‌తో మహిళలు వేధింపులకు గురికావడం, శారీరక హింస, హత్యలు చేయడం, ఆత్మహత్యలకు పాల్పడడం వంటి వాటికి పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తమ అమ్మాయిలకు తక్కువ కట్నం ఇవ్వడానికి వారిని బాగా చదివిస్తున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. కళాశాల స్థాయి విద్యార్థులకు ఇటువంటి పుస్తకాలు పాఠ్యాంశాల్లో భాగం కావడం భయంకరంగా ఉందని పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read

RRR Movie: ఆలిండియా రికార్డ్‌ బద్దులకొట్టిన ఆర్ఆర్ఆర్.. ఆ విషయంలో నంబర్ వన్ సినిమాగా..

Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..

Sri Lanka Crisis: అయ్యా.. మా దేశాన్ని రక్షించండి.. ప్రధాని మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత విజ్ఞప్తి