అయోధ్యలోని చారిత్రాత్మక ఆలయంలో శ్రీరామ్ లల్లా ప్రాన్ ప్రతిష్ఠ వేడుక కోసం యావత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు..తమ భక్తిని చాటుకోవడానికి అయోధ్యకు తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. అయోధ్యలో కొలువుదీరిన ఆ బాలరాముడి కోసం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు భక్తులు ఓ వినూత్న కానుక అందజేశారు..ఛత్తీస్‌గఢ్‌లోని చంపా జిల్లాలోని శివనారాయణ నుండి కొందరు భక్తులు రేగు పండ్లను ఆ రామచంద్రుడుకి బహుమతిగా తెచ్చారు. ఈ పండ్లను రామజన్మభూమి ట్రస్టుకు అందజేసేందుకు 17 మంది భక్తుల బృందం అయోధ్యకు చేరుకుంది.
ఛంపా జిల్లాలోని రాములవారి అమ్మమ్మ ఇళ్లుగా చెప్పుకునే శివ్రినారాయణ ప్రాంతం నుంచి ఈ రేగిపండ్లను తెచ్చినట్లు అనూప్ యాదవ్ అనే భక్తుడు తెలిపారు. అదేవిధంగా అక్కడ లభించే ప్రత్యేక మొక్కను కూడా తీసుకొచ్చామని వివరించారు. ఆ చెట్టు ఆకులు గిన్నె ఆకారంలో ఉంటాయన్నారు. వనవాస సమయంలో సోదరుడు లక్షణుడితోపాటు శివ్రినారాయణ ప్రాంతానికి వచ్చిన శ్రీరామునికి.. ఆ ఆకుల్లోనే శబరి తాను సంగం తిన్న రేగిపండ్లను అందించారని భక్తులు నమ్ముతుంటారు. అందువల్ల ఈ మొక్కను గుడి ఆవరణలో నాటాలని ఆలయ కమిటీని కోరినట్లుగా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన భక్త బృందం కోరింది.
అయోధ్య రామ మందిరం ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరాడు. బాల రామునికి సంబంధించిన ఫొటోలను అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. దీంతో యావత్ భారతదేశం భక్తిపారవశ్యంలో మునిగితేలుతోంది. అయోధ్య రామ మందిరం ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరాడు. బాల రామునికి సంబంధించిన ఫొటోలను అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. దీంతో యావత్ భారతదేశం భక్తిపారవశ్యంలో మునిగితేలుతోంది. ఇదిలా ఉండగా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రామాయణం అయోధ్యకు చేరుకుంది. ఈ పుస్తకం విలువ లక్షా అరవై ఐదు వేల రూపాయలు. రామాలయం ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యేందుకు రామాయణంతో అయోధ్యకు చేరుకున్న పుస్తకాల విక్రేత మనోజ్ సతి మాట్లాడుతూ.. అయోధ్యలోని డేరా నగరంలో మా అందమైన రామాయణంతో ఇక్కడకు చేరుకున్నామని చెప్పారు. ఇది ఎంతో విశిష్టమైనదిగా చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..