Ramnath Ghela crematorium: ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

|

Feb 02, 2022 | 3:13 PM

సాధారణంగా గుడులు, దేవాలయాల్లో పూలు, పండ్లు, పాలు, కొబ్బరిపలుకులు, స్వీట్లను ప్రాసాదంగా ఇస్తారు. ఐతే ఈ గుడిలో మాత్రం బతికిన పీతలను ప్రసాదంగా ఇస్తారు. మీరు సరిగ్గానే విన్నారు.. అక్కడ ప్రసాదంగా ఇచ్చేది అక్షరాలా పీతలే! తర్వాత చనిపోయినవారికి..

Ramnath Ghela crematorium: ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Crabs
Follow us on

Devotees offer crabs in this temple know the reason why: సాధారణంగా గుడులు, దేవాలయాల్లో పూలు, పండ్లు, పాలు, కొబ్బరిపలుకులు, స్వీట్లను ప్రాసాదంగా ఇస్తారు. ఐతే ఈ గుడిలో మాత్రం బతికిన పీతలను ప్రసాదంగా ఇస్తారు. మీరు సరిగ్గానే విన్నారు.. అక్కడ ప్రసాదంగా ఇచ్చేది అక్షరాలా పీత (crabs)లే! తర్వాత చనిపోయినవారికి ఇష్టమైన వస్తువులను సమాధుల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి జరిగే ఈ జాతరకు వేలాది భక్తులు తరలివస్తారు. ఆ విశేషాలు మీకోసం.. గుజరాత్‌ (Gujarat)లోని రుంద్‌నాథ్‌ మహదేవ్‌ శివాలయం (Rundhanath Mahadev temple)లో పూలు పండ్లతోపాటు బతికున్న పీతలతో అభిషేకం చేస్తారు. అక్కడ ఎన్నో ఏళ్లగా దీనిని సంప్రదాయంగా పాటిస్తున్నారు. ప్రతి ఏడాది కొన్ని వేల మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.

నిజానికి సూరత్‌లోని రామ్‌నాథ్‌ ఘేలా శ్మశాన వాటికలో ఉన్న ఈ రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయంలో మాఘమాస ఏకాదశి రోజున ఏడాదికోసారి భక్తులు బతికున్న పీతలతో (ప్రత్యేక ప్రసాదం) పూజలు చేస్తారు. పీతలను నైవేద్యంగా సమర్పించడం వల్లశారీరక రుగ్మతలు నయం అవుతాయని నమ్మకం. ముఖ్యంగా చెవులకు సంబంధించిన రుగ్మతలు (చెవుడు) నయమౌతాయట. ఇక ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల చేతుల్లో వేరే ప్రసాదాలేవీ కనిపించవు. ప్రతి ఒక్కరి చేతిలో ఖచ్చితంగా పీతులుంటాయి. అంతేకాకుండా అక్కడి శ్మాశానంలో మృతదేహాలను దహనంచేసిన ప్రదేశానికి వెళ్లి, చనిపోయిన వారికి ఇష్టమైన వస్తువులను సమాధుల వద్ద ఉంచి, ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు. వింతగా ఉంది కదా!

Also Red:

Job Alert: బీటెక్‌/ఎంటెక్‌/ఐటీఐ అర్హతతో 150 అప్రెంటీస్‌ ఉద్యోగాలు.. త్వరలో ముగియనున్న గడువు