ఓరీ దేవుడో.. సెక్యూరిటీ గార్డ్ వర్సెస్ ఫుడ్ డెలివరీ ఏజెంట్.. కర్రలతో తెగ కుమ్మేసుకున్నారు..ఎందుకో పాపం..!

విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. డెలివరీ బాయ్ సాబీ సింగ్, సెక్యూరిటీ గార్డ్ రామ్ వినయ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరువురిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఓరీ దేవుడో.. సెక్యూరిటీ గార్డ్ వర్సెస్ ఫుడ్ డెలివరీ ఏజెంట్.. కర్రలతో తెగ కుమ్మేసుకున్నారు..ఎందుకో పాపం..!
Delivery Boy

Updated on: Oct 10, 2022 | 2:00 PM

ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకుంటున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతోంది. హౌసింగ్ సొసైటీకి చెందిన ఏరియాలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌, సెక్యూరిటీ గార్డు కుమ్మేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. డెలివరీ బాయ్‌ని సొసైటీలోకి రానివ్వకపోవడంతో ఇరువురి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ సంఘటన నోయిడాలోని కొత్వాలీ ఏరియాలో గల సెక్టార్ 39 గార్డెనియా సొసైటీలో జరిగినట్టుగా తెలిసింది. అక్కడికి వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌తో సెక్యూరిటీ గార్డు గొడవకు దిగాడు. ముందుగా ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని లోనికి పంపించకపోవటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురయిన డెలివరీ ఏజెంట్ సెక్యూరిటీ గార్డుపై దాడికి దిగాడు. చాలా సార్లు ఇద్దరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇద్దరు కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. దాంతో విషయం పోలీసుల వద్దకు చేరింది.

విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. డెలివరీ బాయ్ సాబీ సింగ్, సెక్యూరిటీ గార్డ్ రామ్ వినయ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరువురిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..