Bird Flu in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కలకలం… సంజయ్ పార్క్ లో బాతులు మృతి .. ప్రభుత్వం అలెర్ట్

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న బర్డ్ ఫ్లూ దేశ రాజధాని ఢిల్లీకి వ్యాపించిందా అనే అనుమానాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అక్కడ పలు కాకుల మరణాలు చోటు చేసుకోగా.. తాజాగా సంజయ్ సరస్సు లో..

Bird Flu in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కలకలం... సంజయ్ పార్క్ లో బాతులు మృతి .. ప్రభుత్వం అలెర్ట్
Follow us

|

Updated on: Jan 11, 2021 | 2:39 PM

Bird Flu in Delhi: దేశంలో బర్ద్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బర్ద్ ఫ్లూ జాడలు కనిపించాయి. మరణించిన కాకులు, బాతుల శాంపిల్స్ ను భోపాల్ ల్యాబ్ కు పంపించారు. బర్ద్ ఫ్లూ వల్లనే అవి మృతి చెందాయని ఆ పరీక్షల్లో తేలింది. దీంతో దేశ వ్యాప్తంగా బర్ద్ ఫ్లూ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.

ఇప్పటికే అక్కడ పలు కాకుల మరణాలు చోటు చేసుకోగా.. తాజాగా సంజయ్ సరస్సు లో ఆదివారం మరో 17 బాతులు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. బాతుల మరణాంతరం పార్క్ ను మూసివేశారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా డిడిఎ పార్కుల్లో 91 కాకులు మరణించినట్లు డిడిఎ అధికారి తెలిపారు. రోజుకో పార్క్ లో పక్షలు మృతి చెందుతుండడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. మరో మూడు పార్కులను మూసివేసింది. ఇప్పటికే ఢిల్లీకి ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల రవాణాపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది.

Also Read: మరో రాష్ట్రంలోకి అడుగు పెట్టిన బర్డ్ ఫ్లూ.. 9వేల కోళ్లను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు