పార్లమెంటు ఆవరణలో బుల్లెట్లతో వ్యక్తి హల్‌చల్..!

దేశరాజధాని హస్తినలో బుల్లెట్ల కలకలం రేగింది. పార్లమెంటు ఆవరణలోకి బుల్లెట్లతో ఓ వ్యక్తి ప్రవేశించడంతో హైటెన్షన్ నెలకొంది.. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనతో అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

  • Jyothi Gadda
  • Publish Date - 12:11 pm, Fri, 6 March 20
పార్లమెంటు ఆవరణలో బుల్లెట్లతో వ్యక్తి హల్‌చల్..!

దేశరాజధాని హస్తినలో బుల్లెట్ల కలకలం రేగింది. పార్లమెంటు ఆవరణలోకి బుల్లెట్లతో ఓ వ్యక్తి ప్రవేశించడంతో హైటెన్షన్ నెలకొంది.. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనతో అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్తర్ ఖాన్ అనే వ్యక్తి బుల్లెట్లతో పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పోలీసు విచారణలో అక్తర్ ఖాన్ కు లైసెన్స్ ఉన్న తుపాకీ ఉన్నట్టు తేలింది. అయితే పొరపాటున బుల్లెట్లు తీయకుండానే ప్రవేశించినట్టు తమ విచారణలో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. విచారణ పూర్తైన తర్వాత ఎలాంటి పొరపాటు లేదని తెలుసుకుని ఆయనను విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత అక్తర్ ఖాన్ మాట్లాడుతూ, తన జేబులో బుల్లెట్లు ఉన్నాయనే విషయాన్ని తాను గమనించలేకపోయానని, పొరపాటున బుల్లెట్లతో పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించానని చెప్పినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.