షాకింగ్‌.. కోలుకున్న నర్సుకు మళ్లీ పాజిటివ్‌

కరోనా నుంచి కోలుకున్న నర్సుకు మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఈ విషయంలో భయపడాల్సింది ఏమీ లేదని, కరోనా వైరస్‌ సంక్రమణ ఆమెలో అలాగే ఉండటం వలన పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని

  • Tv9 Telugu
  • Publish Date - 3:43 pm, Tue, 21 July 20
షాకింగ్‌.. కోలుకున్న నర్సుకు మళ్లీ పాజిటివ్‌

కరోనా నుంచి కోలుకున్న నర్సుకు మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఈ విషయంలో భయపడాల్సింది ఏమీ లేదని, కరోనా వైరస్‌ సంక్రమణ ఆమెలో అలాగే ఉండటం వలన పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మున్సిపల్ అథారిటీ అధికారులు‌ చెబుతున్నారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆసుపత్రిలోని ఓ నర్సుకు జూన్‌లో కరోనా సోకింది. ఆ తరువాత కరోనా నుంచి కోలుకున్న ఆ నర్సు.. డ్యూటీలో జాయిన్‌ అయ్యింది. కానీ ఇటీవల జరిపిన పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీనిపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ”ఆమెకు మళ్లీ కరోనా సోకలేదు. ఇది కచ్చితంగా పాత ఇన్ఫెక్షన్. అయితే చనిపోయిన ఆ వైరస్ కణాలు నాసోఫారింజియల్ కేవిటీలో ఉండిపోయాయి. దీని వలనే పరీక్షల్లో పాజిటివ్‌గా సోకినట్లు భావిస్తున్నాం. ఆమెలో యాంటీబాడీస్‌ కూడా చాలా ఉన్నాయి” అని వివరించారు.