
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వాహనాల ట్రాఫిక్ రూల్స్‌కు సంబంధించి కీలక సూచనలు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలను నుంచి అధిక మొత్తంల బీమా ప్రీమియం వసూలు చేయాలని ఎల్‌జీ వీకే సక్సేనా నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అజాగ్రత్తగా డ్రైవింగ్‌ను నిరోధించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.
ఎల్‌జీ వీకే సక్సేనా తన లేఖలో టైర్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియం సిస్టమ్‌ను సిఫార్సు చేశారు. ఇది కారు డ్రైవింగ్ చేసే వ్యక్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ విధానంలో, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, రెడ్ లైట్లు జంప్ చేయడం వంటివి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే, అధిక బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ రోడ్లపై నడుస్తున్న వాహనాలకు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌కు చాలా ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానం అమెరికా, ఐరోపా దేశాల్లో అమలులో ఉంది. ఈ వ్యవస్థను అమలు చేయడం వల్ల డ్రైవింగ్ నిర్లక్ష్యాన్ని తొలగించడమే కాకుండా బీమా సంస్థలపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఎల్‌జీ వీకే సక్సేనా అభిప్రాయపడ్డారు. ఈ విధానాన్ని అమెరికా, యూరోపియన్ దేశాలలో కూడా పాటిస్తున్నారు. దీని లక్ష్యం బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రవర్తన, ప్రమాదాలను తగ్గించడమే అని పేర్కొన్నారు. అంతే కాదు ఈ విధానం వల్ల చాలా మంది ప్రాణాలు కూడా కాపాడవచ్చన్నారు.
నిర్మలా సీతారామన్‌కు వీకే సక్సేనా రాసిన లేఖలో కొన్ని గణాంకాలు కూడా ఉదాహరించారు. ఈ గణాంకాలు అతివేగం, రెడ్ లైట్ జంపింగ్ కారణంగా జరిగిన తీవ్రమైన ప్రమాదాలకు సంబంధించి, 2022లో భారతదేశంలో 4 లక్షల 37 వేల రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 70 శాతం ప్రమాదాలు అతివేగంతో నడిచే కార్ల వల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Delhi LG, VK Saxena has written to the Union Finance Minister, Nirmala Sitharaman, urging her to link insurance premiums of vehicles to the number of traffic violations recorded against the vehicle pic.twitter.com/ZmmASYdhId
— ANI (@ANI) September 25, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..