India Corona: దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

|

Apr 30, 2022 | 10:01 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు

India Corona: దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Coronavirus
Follow us on

India Covid-19 Updates: దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటంతో అందోళన వ్యక్తమవుతోంది. కాగా.. గత 24 గంటల్లో కరోనా (Covid-19) కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. శుక్రవారం 3,688 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు నిన్న కరోనా మహమ్మారి కారణంగా 50 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 18,684 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.74 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల వివరాలు..

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,75,864 కి చేరింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,23,803 కి పెరిగింది.
  • నిన్న కరోనా నుంచి 2,755 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,33,377 కి చేరింది.
  • ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.74 శాతం ఉంది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 188,89,90,935 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 22,58,059 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
  • దేశవ్యాప్తంగా నిన్న 4,96,640 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
  • ఇప్పటివరకు 83.74 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Crime News: దుర్మార్గుడి దారుణం.. కట్నం తీసుకురాలేదని భార్యపైనే అత్యాచారం చేయించాడు.. ఆ తర్వాత

Bank Holidays in May 2022: మే నెలలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..