నిత్యం వేలాది వాహనాలు తిరుగుతూ రద్దీగా ఉండే ఓ జాతీయ రహదారిపై కుప్పలు తెప్పలుగా కండోమ్స్ పడి ఉండటం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆ రహదారి ఎక్కడుంది.? ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటకలోని తుంకూర్ శివారులో కత్సంద్రా-బట్వాది జాతీయ రహదారి 48 పక్కన కుప్పలు తెప్పలుగా కండోమ్స్ దర్శనమిచ్చాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ఇలా వందల సంఖ్యలో కండోమ్స్ కనిపించడం స్థానికంగా కలకలం రేగింది. అటుగా వెళ్లే వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
వీటిని ఎవరైనా పారేసి ఉంటారా.? లేదా ఏదైనా వాహనంలో తరలిస్తుండగా పడిపోయాయా.? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక వాటిల్లో కొన్ని వినియోగించిన కండోమ్స్ కాగా, మరికొన్ని కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయి. ఈ విషయంపై అధికారుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా, నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇలా ఉంటే.. నిర్జన ప్రాంతాల పరిస్థితి ఏంటని అక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿಯಲ್ಲಿ ಕಿಲೋಮೀಟರ್ ಗಟ್ಟಲೆ ಕಾಂಡೋಮ್ಗಳುhttps://t.co/JPql1oAEVihttps://t.co/ETbtYSNVo2#Vishwavani #KannadaNews #KannadaDaily #Condom #Tumkur pic.twitter.com/bxVPXhzcRE
— Vishwavani (@VishwavaniNews) September 8, 2021