Kanyadan Yojana: యువకులకు కండోమ్స్.. యవతులకు పిల్స్.. కొత్త జంటలకు మధ్యప్రదేశ్ సర్కార్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌పై రచ్చ..

మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీ జనాభా ఎక్కువగా ఉండే ఝబువా జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాల తంతు జరిగింది. 296 జంటలు పెళ్లాడి ఒక ఇంటివారయ్యారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యఅతిథి. ప్రభుత్వ సౌజన్యంతో

Kanyadan Yojana: యువకులకు కండోమ్స్.. యవతులకు పిల్స్.. కొత్త జంటలకు మధ్యప్రదేశ్ సర్కార్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌పై రచ్చ..
Kanya Vivha Yojna
Follow us

|

Updated on: May 30, 2023 | 9:42 PM

ముచ్చటైన మేకప్ కిట్… లోపల చూస్తే బ్రాండెడ్ కండోమ్స్… గర్భనిరోధక మాత్రలు…! మధ్యప్రదేశ్‌లోని ఒక సామూహిక వివాహ కార్యక్రమం తర్వాత బైటికొచ్చిన సెన్సేషన్ న్యూస్ ఇది. అవును… ఝబువా జిల్లాలోని గిరిజన ప్రాంతంలో పెళ్లి చేసుకున్న యువతీయువకులకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఇచ్చిన పెళ్లి కానుకలో ఒక భాగమిది. సిగ్గు సిగ్గు అంటూ తిట్టిపోస్తోంది అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీ జనాభా ఎక్కువగా ఉండే ఝబువా జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాల తంతు జరిగింది. 296 జంటలు పెళ్లాడి ఒక ఇంటివారయ్యారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యఅతిథి. ప్రభుత్వ సౌజన్యంతో జరిగే కార్యక్రమం కనుక.. వధూవరులకు పెళ్లి కానుక కూడా ఖచ్చితంగా ఉంటుంది. కొత్త కాపురానికి అవసరమయ్యే అనేక వస్తువులతో పాటు ఒక మేకప్ కిట్ కూడా. కానీ… ఆ మేకప్ బాక్సులో ఈసారి… రెండు కొత్త ఎలిమెంట్స్ తోడయ్యాయి.

ఉచితంగా గర్భనిరోధక మాత్రలు, కండోమ్ ప్యాకెట్లు. పెళ్లవగానే పిల్లలెందుకన్న కాన్సెప్టో ఏమో… ప్రభుత్వమే ఈవిధంగా ఏర్పాటు చేసింది. కానీ… ఇవన్నీ మిమ్మల్ని ఎవరడిగారు సామీ అంటూ వధూవరుల నుంచే సెటైర్లు ఎదురయ్యాయి. ఇదేమైనా బాగుందా… సిగ్గనిపించడం లేదా అంటూ శివరాజ్‌నుద్దేశించి కామెంట్ పెడుతూ సోషల్ మీడియా ద్వారా ఏకిపారేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే విషయాన్ని ప్రభుత్వ సీఈఓను అడిగితే… ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకే ఇలా చేశామని బదులిచ్చారు. ఇందులో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్న కూడా వేశారు.

గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ఇటువంటి విడ్డూరాలు కొత్త కూడా కాదు. గతంలో డిండోరి అనే ప్రాంతంలో కన్యా వివాహ సమ్మేళనం జరిగితే… అక్కడ ఏకంగా గిరిజన మహిళలకు బలవంతంగా కన్యత్వ పరీక్షలు కూడా నిర్వహించారు. ఇప్పుడిలా కండోమ్‌ కహానీతో మళ్లీ విమర్శల పాలవుతోంది శివరాజ్‌ ప్రభుత్వం.

మరిన్ని జాతీయ వార్తల కోసం