Cockroach Party: కాక్రోచ్‌ పార్టీ వ్యవస్థాపకుడు.. అభిజీత్ దిప్కే పై దాడి.. అసలు ఏం జరిగిందంటే?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారిన కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. జైపూర్‌లో కాక్రోజ్ జనతాపార్టీ పేరిట చేపచేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన అబిజిత్‌పై దాడి జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి.

Cockroach Party: కాక్రోచ్‌ పార్టీ వ్యవస్థాపకుడు.. అభిజీత్ దిప్కే పై దాడి.. అసలు ఏం జరిగిందంటే?
Attack On Abhijit Dipke

Updated on: Jun 15, 2026 | 5:43 PM

జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి జరిగింది. దేశంలో నీట్‌ పేపర్‌ లీక్‌కు నిరసనగా జైపూర్‌లోని అమరవీరుల స్మారక మందిరానికి దగ్గర ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన అభిజీత్ దీప్కేపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. అతను వేదికపైకి రాగానే గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఆయనపై దాడి చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన అనంతరం, అభిజీత్ మద్దతుదారులు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని అక్కడికక్కడే పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, దాడి వెనుక ఉద్దేశ్యం, దాడి చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా పూర్తిగా తెలియదు.

ఒక చిన్న మాటతో సోషల్‌ మీడియా నుంచి పుట్టుకొచ్చిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే సోషల్‌ మీడియాలో కోట్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాధించుకున్న ఈ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ వస్తోంది. తాజాగా నీట్‌ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ, హైదరాబాద్‌లోనూ ధర్నాలు నిర్వహించిన ఈ పార్టీ ఇవాళ జైపూర్‌లో ధర్నా చేపట్టింది. ఈ క్రమంలో ధర్నాలో పాల్గొనేందుకువ వచ్చిన అభిజీత్‌పై దాడి జరిగినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us