Notice To Lord Hanuman: కుళాయి లేని టెంపుల్ కి వాటర్ టాక్స్ బిల్లును పంపించిన మున్సిపల్ అధికారులు.. 15 రోజుల గడువు

|

Oct 20, 2022 | 11:54 AM

రాయగడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున హనుమంతుడి ఆలయానికి రూ.400 (నీటి పన్ను) నోటీసు పంపించారు. ఆలయ నిర్వాహకులు 15 రోజుల్లోగా పన్ను చెల్లించాలని.. లేకుంటే కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటారని..

Notice To Lord Hanuman: కుళాయి లేని టెంపుల్ కి వాటర్ టాక్స్ బిల్లును పంపించిన మున్సిపల్ అధికారులు.. 15 రోజుల గడువు
Lord Hanuman Temple
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఓ వింత కేసు తెరపైకి వచ్చింది. నీటి బిల్లు కట్టమని నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఏకంగా  ‘హనుమంతుడికి  నోటీసు పంపింది. హనుమంతుడి ఆలయం నీటి పన్ను బకాయి ఉందని నోటీసులో పేర్కొన్నారు. ఈ వింత విషయం నగరంలోని వార్డు నంబర్ 18 దరోగపరాలో చోటు చేసుకుంది. ఆలయంలో ఒక్క కుళాయి కనెక్షన్ కూడా లేదని.. అయినప్పటికీ అధికారులు వాటర్ టాక్స్ కట్టమని నోటీసు పంపామని చెబుతున్నారు. కార్పొరేషన్ తీరుపై స్థానిక వార్డు ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

రాయగడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున హనుమంతుడి ఆలయానికి రూ.400 (నీటి పన్ను) నోటీసు పంపించారు. ఆలయ నిర్వాహకులు 15 రోజుల్లోగా పన్ను చెల్లించాలని.. లేకుంటే కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటారని నోటీసులో పేర్కొన్నారు. అదే సమయంలో.. నోటీసు జారీ చేసిన వార్తతో స్థానిక ప్రజలు నిరసన ప్రారంభమైంది.  ఏ ప్రాతిపదికన కార్పొరేషన్ కార్యాలయం హనుమంతుడి ఆలయానికి నోటీసులు పంపిందో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు.

 మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పంపించిన నోటీసు:

ఇవి కూడా చదవండి

Water Tax Notice

అమృత్ మిషన్ కింద కనెక్షన్లు: 

ఈ మొత్తం వ్యవహారంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి నిత్యానంద్‌ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. వార్డుల్లో అమృత్‌ మిషన్‌ పథకం కింద ఇళ్లకు కుళాయి కనెక్షన్ల పనులు కూలీల పక్షాన జరిగాయన్నారు. ఈ మొత్తం పని వివరాలను ఉంచి కంప్యూటర్‌లో నమోదు కూడా చేశారు. ఈ క్రమంలో హనుమంతుడి ఆలయానికి కూడా నోటీసులు పంపారు. ఆ ప్రాంతంలో సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏయే ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయో ఆరా తీస్తున్నారు.

స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం
గతంలో చాలా చోట్ల ప్రజలు కలుషిత నీటినే తాగేవారు. దీంతో ప్రజలు అనేక వ్యాధులకు గురయ్యారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. రాయ్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అమృత్ మిషన్ స్కీమ్‌లోని అనేక ఇళ్లకు కుళాయి కనెక్షన్ ఇచ్చామని తెలియజేద్దాం. దీని సంఖ్య 20 వేలకు పైగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..