పులి వెంటాడినా బెదరని అడవి శునకం…వీడియో చూడాల్సిందే !

కర్నాటకలోని కబీరీ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఓ పెద్ద పులి అడవి కుక్కను తరిమి..తరిమి కూడా దాన్ని సమీపించలేకపోయింది. అంతరించిపోతున్న శునక జాతిలోని ఈ కుక్క..మొదట టైగర్ ను చూసి భయంతో పరుగులు పెట్టింది. అయితే సాధారణ కుక్క కన్నా దీని అరుపు వింతగా, కాస్త భయం గొలిపేదిగా ఉండడంతో బహుశా పులి వెనుకంజ వేసినట్టుంది. తన పరుగును ఆపి మెల్లగా నడక ప్రారంభించింది. ‘దోలే’ గా వ్యవహరించే ఈ కుక్క…. పులికి దాదాపు చుక్కలు చూపింది. […]

పులి వెంటాడినా బెదరని అడవి శునకం...వీడియో చూడాల్సిందే !

Edited By: Pardhasaradhi Peri

Updated on: May 14, 2020 | 7:40 PM

కర్నాటకలోని కబీరీ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఓ పెద్ద పులి అడవి కుక్కను తరిమి..తరిమి కూడా దాన్ని సమీపించలేకపోయింది. అంతరించిపోతున్న శునక జాతిలోని ఈ కుక్క..మొదట టైగర్ ను చూసి భయంతో పరుగులు పెట్టింది. అయితే సాధారణ కుక్క కన్నా దీని అరుపు వింతగా, కాస్త భయం గొలిపేదిగా ఉండడంతో బహుశా పులి వెనుకంజ వేసినట్టుంది. తన పరుగును ఆపి మెల్లగా నడక ప్రారంభించింది. ‘దోలే’ గా వ్యవహరించే ఈ కుక్క…. పులికి దాదాపు చుక్కలు చూపింది. తనను అది సమీపించినప్పటికీ దాన్ని కవ్విస్తున్నట్టు హఠాత్తుగా అటూఇటూ గెంతులు వేస్తున్నట్టుగా దానికి దూరమవుతూ వచ్చింది. ఈ తరహా కుక్కలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకునేందుకు రకరకాలుగా.. విజిల్ ఊదినట్టు కూతలు పెడతాయని జంతు శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఏమైనా ఈ వీడియో చూడాల్సిందే !