భారీ వర్షాలకు అక్కడక్కడ చేపల వర్షం కురవటం చూశాం. మరికొన్ని చోట్ల నీటి ప్రవాహంతో భారీ ఎత్తున చేపలు కొట్టుకురావటం కూడా చూశాం..రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చేపలు, మాంసం, కోళ్లు, గుడ్లు, ఆయిల్, పాలు వంటివి పడిపోతే వాటిని ఎత్తుకుపోయేందుకు ప్రజలు ఎగబడటం కూడా చూశాం.. కానీ, డ్రెయిన్ కాలువలో నోట్ల కట్టలు కొట్టుకురావటం ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే ఇక్కడ నీటి కాల్వలో కట్టల కోద్దీ కరెన్సీ నోట్లు కొట్టుకువచ్చాయి. ఆ తర్వాత ఈ వార్త ఆ ప్రాంతమంతా దావానలంలా వ్యాపించింది. ఇది బీహార్‌లోని ససారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ససారం మున్సిపల్ పరిధి మొరాదాబాద్ కాలువలో నోట్ల కట్టలు కనిపించాయి. ఈ రూపాయలు నిజమా, నకిలీవా అనేది ప్రస్తుతం పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. నోట్ల కట్టలు ఎత్తుకెళ్లే వీడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.
డ్రెయిన్‌లోకి దిగి పెద్ద సంఖ్యలో నోట్ల కట్టలు సేకరిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, మేము వైరల్ వీడియోపై సరైన ఆధారాలు, ధృవీకరణ లేదు. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించి పోలీసు-అడ్మినిస్ట్రేషన్ కూడా ధృవీకరించడం లేదు. కానీ ససారం ప్రాంత సరిహద్దులో ఉన్న మొరాదాబాద్ కాలువ నీటిలో 100, 200, 500 నోట్ల కట్టలు విసిరినట్లు చెబుతున్నారు. కాల్వలో ఉన్న డబ్బుల మూటపై ప్రజల కళ్లు పడగానే.. పిల్లలు, యువకులు, మహిళలు, వృద్ధులు అంతా గుమిగూడారు. నోట్ల కట్టలను ఎత్తుకుపోయేందుకు పోటీపడ్డారు. అయితే, ఈ నోట్ల కట్ట నిజమో, నకిలీదో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు. ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలు కాల్వలోకి ఎందుకు విసిరారని సర్వత్రా చర్చ జరుగుతోంది.
నివేదిక ప్రకారం, కొందరు వ్యక్తులు కాలువలో స్నానాలు చేస్తున్నప్పుడు నోట్లు ప్రవహించడం చూశారు. ప్రవహిస్తున్న నోట్లను అనుసరించి, ముందుకు వెళ్లి చూసింది ఆ బృందం. కురైచ్ వంతెన కింద నీటిలో అలాంటి అనేక కట్టలు విసిరివేసినట్టుగా గుర్తించారు.. నీటిలో కొన్ని నోట్లు దొరికినట్లు సమాచారం అందిందని రోహ్తాస్ పోలీస్-అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
बिहार के सासाराम में एक नहर से नोटों के बंडल मिलने से सनसनी फैल गई। मुरादाबाद नहर में पानी के साथ-साथ नोटों की गड्डियां बहती दिखी। #Bihar #BiharNews #Sasaram @bihar_police pic.twitter.com/MNacrElmg4
— NBT Bihar (@NBTBihar) May 6, 2023
పోలీసు బృందం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినా ఏమీ దొరకలేదు. నగరంలోని ప్రధాన రహదారికి సమీపంలో జరిగిన సంఘటనగా తీవ్ర సంచలనం రేపుతోంది. వైరల్ అయిన వీడియోపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..