కాంగ్రెస్, బీజేపీలు ‘పోషించిన’ ఆ పత్రిక యజమాని అరెస్ట్

వివాదాస్పద బిజినెస్ మన్, మధ్యప్రదేశ్ లో ఓ చిరు వార్తాపత్రిక (టాబ్లాయిడ్) యజమాని కూడా అయిన జీతూ సోని.. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. 40 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతగాడు

కాంగ్రెస్, బీజేపీలు 'పోషించిన' ఆ పత్రిక యజమాని అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2020 | 10:50 AM

వివాదాస్పద బిజినెస్ మన్, మధ్యప్రదేశ్ లో ఓ చిరు వార్తాపత్రిక (టాబ్లాయిడ్) యజమాని కూడా అయిన జీతూ సోని.. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. 40 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతగాడు గత 7 నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. రేప్, మనుషుల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, భూకబ్జా, బ్లాక్ మెయిలింగ్ వంటి అనేక నేరాలతో ప్రమేయమున్న జీతూ సోనిని పట్టి ఇఛ్చినవారికి ప్రభుత్వం 1.6 లక్షల రివార్డు ప్రకటించింది. గుజరాత్ లోని ఇతని స్వస్థలమైన అమ్రేలి జిల్లాలో ఇతడిని అరెస్టు చేశారు. ఇతని క్రిమినల్ హిస్టరీ చాలానే ఉంది. ఒకప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి రాజకీయ ప్రాపు సంపాదించిన ఇతనికి ఉన్నత పోలీసు అధికారుల తోనూ లింకులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు ఇదివరలో సీఎం గా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ (ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా)..సీనియర్ అడ్వైజర్ల సెక్స్ స్కాండల్ తాలూకు వార్తలను ఇతని ప్రత్రిక గత సెప్టెంబరులో ప్రచురించడంతో  రాష్ట్రంలో పెను రాజకీయ దుమారం రేగింది. లోగడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డాన్స్ బార్, హోటల్, రెస్టారెంట్ వంటి ఇతని ఆస్తులపై పోలీసులు దాడులు చేశారు. ఇతని ఆధ్వర్యంలో నడిచిన సెక్స్ రాకెట్ కి సంబంధించి పోలీసులు అయిదుగురు మహిళలను, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సెక్స్ టేపుల ద్వారా అనేకమంది బ్యూరోక్రాట్లను, పొలిటిషియన్లను బ్లాక్  మెయిల్ చేసినట్టు వెల్లడైంది. జీతూ సోని నివాసం నుంచి మొబైల్ ఫోన్లను, ఆడియో రికార్డింగులను, ల్యాప్ టాప్ నుచి నాలుగు వేల ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Latest Articles
అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల్ని అస్సలు కొనకండి..
అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల్ని అస్సలు కొనకండి..
వాటే న్యూస్... ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన..
వాటే న్యూస్... ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన..
నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిని కోరుకుంటోన్న ఆ ఆరు జట్లు
నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిని కోరుకుంటోన్న ఆ ఆరు జట్లు
మీ ఐ పవర్ ఏ రేంజిదంటే? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపులెహె!
మీ ఐ పవర్ ఏ రేంజిదంటే? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపులెహె!
నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..
నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..
మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్మినల్ భవనం
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్మినల్ భవనం
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..