చతురోక్తులు విసరడం... నవ్వించడం అంత సులువు కాదు. సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా హాస్యాన్ని పండించడం కొందరికి మాత్రమే సాధ్యం. నవ్వు ఆరోగ్యానికి మాత్రమే కాదు సహజసిద్ధమైన పెయిన్‌కిల్లర్స్‌గా కూడా పనిచేస్తాయి
TV9 Telugu
ఒత్తిడి, ఆందోళన అనిపిస్తే కామెడీ వీడియోలు చూస్తే.. వాటితో వచ్చే నవ్వు స్ట్రెస్‌ను ఇట్టే మటుమాయం చేస్తుందన్న సలహా చాలాసార్లే మీరు వినే వుంటారు. నిజానికి దానివల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు
TV9 Telugu
మనసు బాగాలేనప్పుడు మాత్రలా... సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని రెట్టింపు చేసే బూస్టర్‌లా నవ్వు వెయ్యి విధాలుగా ఉపయోగపడుతుంది. స్నేహితులు, బామ్మలు చెప్పే చతురోక్తులు, పుస్తకాలు, సినిమాలు.. ఇలా ఏదో విధంగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ ఉంటాం
TV9 Telugu
ముఖ్యంగా పిల్లలు పుట్టాక, మెనోపాజ్‌లో మహిళలు బరువు పెరుగుతుంటారు. తగ్గడానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. వీటిల్లో ‘నవ్వు’ను కూడా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
పదిహేను నిమిషాలు కామెడీ వీడియోలు చూస్తే.. 40 కెలోరీలను తగ్గించగలదని ఓ అమెరికన్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు, మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట
TV9 Telugu
అలాగే గర్భం దాల్చడానికి ఐవీఎఫ్‌ను ఆశ్రయిస్తున్న వారెంతమందో ఉన్నారు. దీంతో అది ఎంతవరకూ సఫలమవుతుందో అన్న కంగారు సహజమే. నిజానికి ఆ సమయంలో చింతలన్నీ వదిలేసి, ఆనందంగా నవ్వాలట
TV9 Telugu
నవ్వు ఆ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీరంలోని అవయవాలన్నింటికీ ఆక్సిజన్ బాగా అందిస్తుంది. దీంతో ఇన్‌ఫ్లమేషన్ తగ్గడంతోపాటు ట్రీట్‌మెంట్‌కి మరింత బాగా స్పందించేలా చేస్తుందట
TV9 Telugu
ప్రెగ్నెన్సీలో చాలామందికి మధుమేహం, బీపీ వంటివి వచ్చి రోగనిరోధకతా తగ్గుతుంది. అవి దరిచేరకుండా కాబోయే అమ్మ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 15 నిమిషాలు నవ్వితే మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి