Eyelashes Growth Tips: కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..

కను రెప్పలు ఒత్తుగా ఉంటే.. కళ్లకు వచ్చే ఆ అందమే వేరు. హీరోయిన్స్ ఎక్కువగా కళ్లనే హైలేట్ చేస్తూ ఉంటారు. కళ్లతోనే ముఖానికి ఎంతో అందం వస్తుంది. కళ్ల అందాన్ని రెట్టింపు చేసేవి కను రెప్పలే. కళ్లు పలికే భావాలే వేరు. అందుకే సినామాల్లో కూడా కళ్లనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అందే వాటికి మస్కారా, ఐలైనర్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి కృత్రిమ పదార్థాలు ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో..

Eyelashes Growth Tips: కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
Eyelashes Growth Tips
Follow us

|

Updated on: May 06, 2024 | 5:56 PM

కను రెప్పలు ఒత్తుగా ఉంటే.. కళ్లకు వచ్చే ఆ అందమే వేరు. హీరోయిన్స్ ఎక్కువగా కళ్లనే హైలేట్ చేస్తూ ఉంటారు. కళ్లతోనే ముఖానికి ఎంతో అందం వస్తుంది. కళ్ల అందాన్ని రెట్టింపు చేసేవి కను రెప్పలే. కళ్లు పలికే భావాలే వేరు. అందుకే సినామాల్లో కూడా కళ్లనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అందే వాటికి మస్కారా, ఐలైనర్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి కృత్రిమ పదార్థాలు ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే నేచురల్‌గా కూడా కను రెప్పలను ఒత్తుగా పెంచుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల లాభాలే కానీ.. ఎలాంటి చెడు ప్రభావం పడదు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుదం:

ఆముదం గురించి అందరికీ తెలుసు.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆముదాన్ని ఎక్కువగా జుట్టుకే రాస్తూ ఉంటారు. కానీ ఆముదాన్ని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కను రెప్పలకు రాస్తే సరిపోతుంది. ఇలా కంటిన్యూగా చేయడం వల్ల కను రెప్పలు ఒత్తుగా పెరుగుతాయి. ఆముదం ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

లావెండర్ ఆయిల్:

లావెండర్ ఆయిల్ కూడా కను రెప్పలు ఒత్తుగా పెరిగేందుకు హెల్ప్ చేస్తాయి. కొబ్బరి నూనెలో కొద్దిగా లావెండర్ ఆయిల్ కలిపి.. కను రెప్పలపై రాయండి. ఈ చిట్కా రాత్రి పడుకునే ముందు రాయాలి. ఇలా కంటిన్యూగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అలోవెరా జెల్:

అలోవెరాతో కేవలం ముఖ సౌందర్యాన్నే కాకుండా.. కను రెప్పలు ఒత్తుగా అయ్యేందుకు కూడా బాగా ఉపయోగ పడుతుంది. అలోవెరా జెల్‌ను కను రెప్పలకు రాసి ఓ 15 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత నీటితో కడిగేయండి. ఇలా తరచూ చేయడం వల్ల కను రెప్పలు పెరుగుతాయి. అలోవెరా జెల్‌ను రాత్రి పూట కూడా రాసుకోవచ్చు.

కొబ్బరి పాలు:

కొబ్బరి పాలతో శరీర ఆరోగ్యం, అందమే కాకుండా కను రెప్పలను కూడా ఒత్తుగా పెంచుకోవచ్చు. కొద్దిగా కొబ్బరి పాలను తీసుకుని.. కను రెబ్బలను రాసుకోవాలి. ఇలా ఓ పావు గంట రెస్ట్ తీసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

విటమిన్ ఇ:

జుట్టు పెరుగుదలలో విటమిన్ ఇ ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్ రాసుకుని పడుకోవాలి. ఉదయం లేవగానే శుభ్రంగా కడిగేసు కోవాలి. ఇలా కంటిన్యూగా చేస్తే.. కను రెప్పలు అనేవి ఒత్తుగా పెరుగుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే