
కేంద్ర బడ్జెట్‌లో క్యాన్సర్ రోగులకు పెను ఊరటనిచ్చే కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ ఆదివారం(ఫిబ్రవరి 1)నాడు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 80 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది. క్యాన్సర్ రోగులు వాడే 17 మెడిసిన్స్‌పై పన్ను తగ్గిస్తు్న్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే మైక్రో అవెన్స్, విమాన విడిభాగాలపై పన్ను తగ్గించనున్నట్లు ప్రకటించారు.
విదేశీ యాత్రలకు వెళ్లే పర్యాటకులకు ఊరటనిస్తూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. విదేశీ యాత్రలపై పన్నులను తగ్గించారు. అలాగే చదవులు, వైద్యంపై ప్రస్తుతమున్న 5శాతం టీడీఎస్‌ను 2 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించారు.
బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త హైస్పీడ్ రైల్ కారిడర్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇందులో మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు హైదరాబాద్ నుంచే కావడం విశేషం. హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – పూణె, హైదరాబాద్- బెంగుళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు.
అటు భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షక బడ్జెట్ 2026లో కీలక ప్రకటనచేశారు. భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే సంస్థలకు 2047 వరకు ట్యాక్స్ హాలీడే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ఈ నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం దక్కనుంది. ఈ ట్యాక్స్ హాలీడేతో విదేశీ డేటా సెంటర్లు భారత్‌లో భారీగా పెట్టుపడులు పెట్టే అవకాశముంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026 ఎలా ఉంది..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026తో కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి, మరికొన్ని తగ్గనున్నాయి.
పెరిగేవి: విదేశీ మద్యం, లగ్జరీ వాచ్‌లు
తగ్గేవి: క్యాన్సర్ ఔషధాలు, డయాబెటిక్ మందులు, ఈవీ బ్యాటరీలు, సోనాల్ ప్యానల్స్, విదేశీ యాత్రలపై పన్ను, మైక్రో అవెర్స్, విదేశీ విద్య, చెప్పులు, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలు
వీటితో పాటు దేశీయంగా తయారయ్యే మొబైల్స్, ట్యాబ్లెట్ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది.