
రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు, సమాజంలోని వివిధ వర్గాలలో పార్టీ ప్రాబల్యాన్ని విస్తరించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితన్ నిబిన్.. రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, కో-ఇన్‌చార్జ్‌ల కీలక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వారికి కీలక దిశానిర్దేశాలు చేశారు. తమకు అప్పగించిన బాధ్యతను ప్రాథమిక ప్రాధాన్యతగా భావించి, వ్యక్తిగత ప్రయోజనాలపై కాకుండా సంస్థ ప్రయోజనాల కోసం పనిచేయాలని నితిన్ నబిన్ ఇంచార్జ్ లకు స్పష్టం చేశారు. ఇన్‌చార్జ్‌లు, కో-ఇన్‌చార్జ్‌లు తమతమ రాష్ట్రాలను క్రమం తప్పకుండా సందర్శించాలని, రాష్ట్ర విభాగాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. నేతలు పార్టీని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని, ఢిల్లీకి తరచుగా రావడం కంటే తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఎక్కువ సమయం గడపాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, పార్టీకి కొత్తగా నియమితులైన రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, కో-ఇన్‌చార్జ్‌లను ఆదేశించారు
క్షేత్రస్థాయి సంస్థాగత కార్యకలాపాలపై దృష్టి
బూత్ స్థాయిలో క్రమం తప్పకుండా సంస్థాగత సమావేశాలు నిర్వహించాలని, క్షేత్రస్థాయి నుండి వచ్చిన అభిప్రాయాలను కేంద్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా నబిన్ సూచించారు. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత కార్యకలాపాలు క్షేత్రస్థాయికి చేరేలా చూడాలని, రాష్ట్రాల్లో పార్టీ పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించాలని రాష్ట్ర ఇన్‌చార్జ్‌లకు సూచించారు. మహిళలు, యువత, సమాజంలోని వివిధ వర్గాలకు పార్టీని చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. విక్సిత్ భారత్ సంకల్ప్‌తో సహా పార్టీ సంస్థాగత కార్యక్రమాల కింద క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహించాలని, వివిధ సామాజిక వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని నితిన్ నవీన్ సూచించారు.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను కొత్తగా నియామకమైన ఇంచార్జ్ లు తరచుగా సందర్శించాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు. కార్యవర్గ సభ్యులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ఢిల్లీకి అనవసర పర్యటనలు చేయవద్దని సూచించారు. కొంతమంది పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి తరచుగా పర్యటనలు చేస్తూ, సీనియర్ నాయకత్వంతో సమావేశాల కోసం అధిక సమయం వెచ్చిస్తున్నారని ఫిర్యాదులు వచ్చినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. ఒక రాష్ట్రానికి బాధ్యత అప్పగించబడిన వారు అక్కడ తమకు కేటాయించిన సంస్థాగత పనులపైనే దృష్టి పెట్టాలని నబిన్ స్పష్టం చేసినట్లు సమాచారం
ఉత్తర ప్రదేశ్ పై ప్రత్యేక ఫోకస్
యూపీ అసెంబ్లీలో చాలా కీలకం కావడంతో యుపి ఇన్‌చార్జ్ వినోద్ తావ్డే ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న లక్నో లో యోగి ఆదిత్య నాథ్ ను కలవనున్నారు.. యూపీ సంస్థాగత కార్యకలాపాలు, రాబోయే రాజకీయ కార్యక్రమాల సన్నాహాలపై చర్చలు జరపనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఆయన పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. యూపీ పార్టీ సంస్థాగత కార్యకలాపాలకు సంబంధించిన సమావేశాల్లో వినోద్ తవ్డే పాల్గొంటారు… వినోద్ తావ్డేతో పాటు సహ-ఇన్‌చార్జ్‌లు కూడా లక్నో వెళ్ళనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.