Viral Video: యమపాశంలా దూసుకువచ్చిన బండ రాయి.. కొండపై నుంచి వచ్చిన మృత్యువు

|

Apr 29, 2022 | 8:54 PM

అప్పటి వరకు ప్రయాణం బాగా జరిగింది. ప్రకృతి అందాలను అస్వాదిస్తూ ఫ్రెండ్స్ బైక్‌పై వెళ్లున్నారు. ఇంతలోనే యమపాశంలో దూసుకువచ్చింది ఓ బండ.

Viral Video: యమపాశంలా దూసుకువచ్చిన బండ రాయి.. కొండపై నుంచి వచ్చిన మృత్యువు
Accident
Follow us on

Shocking Video:మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో చెప్పలేం.. చావు ఎటువైపు నుంచి దూసుకురావొచ్చు. వేటాడే మృత్యువు నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. కొన్నిసార్లు చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది. కేరళ ప్రకృతి అందాలను ఎంజాయ్‌ చేస్తూ.. బైక్స్‌పై రైడ్‌కు వెళ్లిన ఫ్రెండ్స్‌ను ఊహించని విషాదం వెంటాడింది. కేరళ(Kerala)లోని తామరస్సేరి(Thamarassery) కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ఇద్దరు ఫ్రెండ్స్‌ వెళ్తున్న సమయంలో సడెన్‌గా కొండపై నుంచి ఓ పెద్ద బండరాయి దూసుకొచ్చి బైకర్స్‌పై పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి.

రెండు బైక్‌లపై నలుగురు ఫ్రెండ్స్‌ లాంగ్‌ టూర్‌ వెళ్తున్నారు. ఓ బైక్‌పై ఇద్దరు, మరో బైక్‌పై ఇద్దరు ఫ్రెండ్స్‌ వెళ్తున్నారు. కేరళ అందాలను ఎంజాయ్‌ చేస్తూ కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందు వెళ్తున్న ఇద్దరు ఫ్రెండ్స్‌ను వెనుక వెళ్తున్నవారు వీడియో తీస్తున్నారు. ఇదే సమయంలో ఓ టర్నింగ్‌ వద్ద సడెన్‌గా ఓ కొండపై నుంచి పెద్ద బండ రాయి వేగంగా వచ్చి ముందు వెళ్తున్న ఫ్రెండ్స్‌ బైక్‌పై పడింది. దీంతో తీవ్ర గాయాలై వారిలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read:  టాలీవుడ్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో యువ దర్శకుడు దుర్మరణం

Guntur: సంచలనం.. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు ఉన్మాదికి ఉరిశిక్ష