ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. వాటితో ఏం చేశారో తెలిస్తే..

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు రోజురోజుకూ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా బీహార్‌లో ఓ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోకి ప్రవేశించిన ఆరుగురు వ్యక్తులు.. చేతుల్లో పాములను పట్టుకొచ్చి.. వాటితో బెదిరించి ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేశారు. విషయం తెలిసిన రైల్వే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు.

ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. వాటితో ఏం చేశారో తెలిస్తే..
Jansewa Express Snake Incident

Updated on: Oct 02, 2026 | 7:01 PM

సాధారణంగా వికలాంగులూ, లేదా యాచకులు ట్రైన్‌లో ప్యాసింజర్స్‌ నుంచి డబ్బులు అడగడం మనం చూసి ఉంటాం. కానీ ఇక్కడ కొందరు వ్యక్తులు మాత్రం.. పాములతో ప్రయాణికులను బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సోన్‌పూర్ డివిజన్ పరిధిలో నడిచే జనసేవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోకి ఎక్కిన ఆరుగురు వ్యక్తులు.. చేతులో పాములను పట్టుకొని.. ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన సోన్‌పూర్ ఆవుట్‌పోస్ట్ RPF సిబ్బంది నెక్ట్స్ స్టేషన్‌లో రంగంలోకి దిగి.. పాములతో ప్రయాణికులను భయపెడుతున్న మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంరం వారిని స్టేషన్‌కు తరలించి విచారించగా.. వారంతా పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు పోలీసలు తెలిపారు.. వారి ఆచూకీ గురించి ప్రశ్నించగా కొందరు లక్నో అని, మరికొందరు హిమాచల్ ప్రదేశ్ అంటూ పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని ఈసీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సరస్వతి చంద్ర తెలిపారు.

ప్రస్తుతం వారి గురించి పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నామని.. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ట్రైన్లలో పాములను తీసుకురావడం చట్టరిత్యా నేరమని.. ఇలాంటి ఘటనలకు ఎవరైనా పాల్పడితే.. చట్టప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అలాగే.. పాములను హింసించడం వంటివి కూడా చట్టరిత్యా నేరమని.. వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us