ఒకేసారి 20 కి పైగా కోతుల గుంపు దాడి.. అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన రైతు!

సుప్రీంకోర్టులో వీధి కుక్కల విషయంలో అనుకూల, ప్రతికూల అంశాల మధ్య చర్చ జరుగుతోంది. అయితే ఇంతలో బీహార్ నుండి ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తిపై కోతులు ముక్కుమ్మడిగా దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కోతుల దాడి తర్వాత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు ప్రజలు ఒంటరిగా బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికి వెనుకాడుతున్నారు.

ఒకేసారి 20 కి పైగా కోతుల గుంపు దాడి.. అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన రైతు!
Bihar Monkeys Attacked

Updated on: Aug 18, 2025 | 8:41 AM

సుప్రీంకోర్టులో వీధి కుక్కల విషయంలో అనుకూల, ప్రతికూల అంశాల మధ్య చర్చ జరుగుతోంది. అయితే ఇంతలో బీహార్ నుండి ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తిపై కోతులు ముక్కుమ్మడిగా దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఆదివారం(ఆగస్టు 17) ఉదయం, బీహార్‌లోని మధుబని జిల్లాలోని షాపూర్ గ్రామంలో స్థానిక నివాసి, రైతు అయిన 67 ఏళ్ల రామ్‌నాథ్ చౌదరిపై కోతులు దాడి చేశాయి. 20 కి పైగా కోతులు అతనిపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ భయంకరమైన దాడిలో రామ్‌నాథ్ మరణించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కోతుల గుంపు నుండి తనను తాను రక్షించుకోలేకపోయాడు. రామ్‌నాథ్ చౌదరి లోహత్ షుగర్ మిల్లులో గుమస్తాగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు.

రామ్‌నాథ్ చౌదరి ప్రతిరోజు లాగే ఉదయం పొలానికి వెళ్ళాడు. ఈ సమయంలో అతను తన పశువులకు మేత తీసుకురావడానికి పొలానికి నుండి వెళ్ళేవాడు. అతను మేత కోస్తుంగా.. అకస్మాత్తుగా కోతుల గుంపు అతన్ని చుట్టుముట్టింది. అక్కడ 20 కి పైగా కోతులు ఉన్నాయి. రామ్‌నాథ్ పోరాడటానికి ప్రయత్నించాడు. కానీ కోతుల గుంపు అతన్ని వదిలిపెట్టలేదు. దీని తరువాత కోతులు రామ్‌నాథ్ చౌదరిని తీవ్రంగా గాయపర్చాయి. దీంతో అక్కడే కుప్పకూలిపోయాడు.

గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గాయపడిన రామ్‌నాథ్‌ను మధుబని సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. స్థానిక ముఖియా రామ్‌కుమార్ యాదవ్ ఈ సంఘటన గురించి సమాచారం అందించారు. ఈ భయంకరమైన దాడి తర్వాత, పాండౌల్ పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. కోతులను పట్టుకోవాలని వారు అటవీ శాఖను అభ్యర్థించారు.

ఆదివారం ఉదయం కోతుల దాడి తర్వాత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు ప్రజలు ఒంటరిగా బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికి వెనుకాడుతున్నారు. కోతులు ఈ విధంగా ఒకరి ప్రాణాన్ని తీస్తాయని వారు ఎప్పుడూ అనుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు తరచుగా పంటలను మరియు ఇళ్లను కూడా దెబ్బతీస్తాయని గ్రామ ప్రజలు అంటున్నారు. కానీ ఈసారి అవి ఒక మనిషి ప్రాణాన్ని బలిగొన్నాయి. కోతుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..