Watch Video: మ‌హాత్మాగాంధీకి నివాళ్లులర్పిస్తూ బీహార్ సీఎం వింత ప్రవర్తన.. దుమారం రేపుతున్న వీడియో!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరచూ చేసే పనులు చర్చకు దారి తీస్తున్నాయి. ఈసారి గాంధీ వర్ధంతి సందర్భంగా వందనం చేయాల్సిన సమయంలో చప్పట్లు కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. నితీష్ కుమార్‌ను చూసిన అసెంబ్లీ స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్, పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా షాక్ అయ్యారు. వెంటనే అంపేందుకు సైగలు చేశారు.

Watch Video: మ‌హాత్మాగాంధీకి నివాళ్లులర్పిస్తూ బీహార్ సీఎం వింత ప్రవర్తన.. దుమారం రేపుతున్న వీడియో!
Bihar Cm Nitish Kumar

Updated on: Jan 30, 2025 | 5:29 PM

జాతిపిత మ‌హాత్మాగాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వ్యవహారించిన తీరు విమర్శలపాలు చేసింది. గాంధీజీకి నివాళ్లులర్పించే సమయంలో చప్పట్లు కొట్టిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో పాట్నాలో జరిగిన కార్యక్రమంలో నితీష్ కుమార్ అకస్మాత్తుగా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. వెంటనే తేరుకున్న బీహార్ అసెంబ్లీ స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్ సైగల ద్వారా అతన్ని ఆపడానికి ప్రయత్నించారు.

నితీష్‌కి సంబంధించిన ఈ వైరల్ వీడియోపై ఇప్పుడు బీహార్‌లో రాజకీయ గందరగోళం మొదలైంది. నితీష్ వింత ప్రవర్తనపై ఆర్జేడీ నుంచి జన్ సూరజ్ వరకు ప్రశ్నలు సంధించారు. పాట్నాలోని గాంధీ ఘాట్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యక్రమం సందర్భంగా నేతలంతా క్యూలో నిలబడి బాపుజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఇక్కడ బాపు కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. అదే సమయంలో సైనికులు బాపుజీకి సెల్యూట్ చేస్తున్నారు. ఇంతలో నితీష్ కుమార్ ఒక్కసారిగా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. నితీష్ చప్పట్లు కొట్టడం చూసి స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్, డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా షాక్ అయ్యారు. నంద్ కిశోర్ యాదవ్ వెంటనే స్పందించి సైగలు చేస్తూ.. నితీష్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో నితీష్ ఆగిపోయారు.

వీడియో చూడండి.. 

ఈ మొత్తం విషయంలో జనతాదళ్ యునైటెడ్ మౌనం పాటించింది. నితీష్ మానసిక పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్ ప్రశ్నలు లేవనెత్తింది. ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా హ్యాండిల్ బాత్ బీహార్ ఒక పోస్ట్ రాసింది. గాంధీజీ నివాళి సభలో నితీష్ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి బాగానే ఉందా? అంటూ సెటైర్లు వేశారు. నితీష్ కుమార్ కు పిచ్చి పట్టిందని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ విలేకరులతో అన్నారు. గాంధీ వర్ధంతిని ముఖ్యమంత్రి ఎగతాళి చేశారని మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..