భగత్ సింగ్ సజీవ జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రదేశాలు.. మీరూ చూసేయండి..!

ఆగస్టు 15 వచ్చిందంటే ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. జాతీయ జెండా, దేశభక్తి గీతాలు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకునే కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈసారి ఆగస్టు 15ను మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటే.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జీవితంతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించవచ్చు.

భగత్ సింగ్ సజీవ జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రదేశాలు.. మీరూ చూసేయండి..!
Bhagat Singh

Updated on: Aug 13, 2026 | 8:21 PM

ఆగస్టు 15 వచ్చిందంటే ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. జాతీయ జెండా, దేశభక్తి గీతాలు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకునే కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈసారి ఆగస్టు 15ను మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటే.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జీవితంతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించవచ్చు. పంజాబ్‌లో ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చరిత్రను కళ్లముందు నిలిపేలా ఉంటాయి.

ఖట్కర్ కలాన్.. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం

పంజాబ్‌లోని నవాన్‌షహర్ సమీపంలోని ఖట్కర్ కలాన్ భగత్ సింగ్ పూర్వీకుల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. భగత్ సింగ్ జన్మస్థలం ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నప్పటికీ.. ఆయన కుటుంబ మూలాలు ఖట్కర్ కలాన్‌తో ముడిపడి ఉన్నాయి. భగత్ సింగ్ కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలు, వస్తువులు, ఫొటోలు, పత్రాలను ఇక్కడ చూడవచ్చు.

గ్రామంలో భగత్ సింగ్ స్మారక చిహ్నం, మ్యూజియం కూడా ఉన్నాయి. ఆయన బాల్యం, కుటుంబ నేపథ్యం, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలతో కలిసి సందర్శిస్తే.. పుస్తకాల్లో చదివే చరిత్రను ప్రత్యక్షంగా అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది.

హుస్సేనీవాలా.. అమరవీరుల స్మారకం

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఉన్న హుస్సేనీవాలా జాతీయ అమరవీరుల స్మారక స్థలం భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ త్యాగాలను గుర్తుచేస్తుంది. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం దేశభక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఇక్కడ అమరవీరుల జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 15 సందర్భంగా ఈ ప్రాంతాన్ని సందర్శించడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మరింత దగ్గరగా తెలుసుకోవచ్చు.

ఈ ప్రదేశాలు కేవలం పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదు.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేసే స్ఫూర్తి కేంద్రాలు కూడా..!

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us