
భారత్‌లో మొబైల్ ఫోన్ల తయారీ రంగం సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక గణాంకాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. మొబైల్ తయారీ పరిశ్రమకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలు, దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చిన పన్నుల ఆదాయం, ఈ రంగంలో కల్పించిన ఉపాధి వివరాలను ఆయన పంచుకున్నారు.
కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మొబైల్ తయారీ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.19,000 కోట్ల ప్రోత్సాహకాలను చెల్లించగా.. ఈ రంగం ద్వారా రూ.25,000 కోట్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయం సమకూరినట్టు ఆయన స్పష్టం చేశారు. అలాగే రూ.3,00,000 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు పేర్కొన్నారు.
అంతేకాదు మన దేశంలో ఉపాది కల్పనకు ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ఎంతో కీలకంగా మారిందని.. ఈ రంగం ద్వారా దాదాపు 25 లక్షల మందికి ఉపాధి లభిస్తుండగా, ఒక్క మొబైల్ తయారీ పరిశ్రమలోనే 12 లక్షల మంది పనిచేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఇందుకు కీలకంగా మారాయన్నారు.
కేంద్ర మంత్రి పోస్ట్ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.