ఆగస్టు 15 నే దాడికి ఐసిస్ ఉగ్రవాది ప్లాన్, అయితే..

ఢిల్లీలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాది మహమ్మద్ ముస్తకీమ్ ఖాన్ అలియాస్ అబూ యూసూఫ్..ఈ నెల 15 ..భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడే నగరంలో పలు చోట్ల ఉగ్రదాడికి ప్లాన్ చేశాడని..

ఆగస్టు 15 నే దాడికి ఐసిస్ ఉగ్రవాది ప్లాన్, అయితే..

Edited By:

Updated on: Aug 22, 2020 | 6:33 PM

ఢిల్లీలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాది మహమ్మద్ ముస్తకీమ్ ఖాన్ అలియాస్ అబూ యూసూఫ్..ఈ నెల 15 ..భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడే నగరంలో పలు చోట్ల ఉగ్రదాడికి ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. అయితే భారీ భద్రతా దళాలు మోహరించి ఉన్న దృష్ట్యా,,దాన్ని అమలు చేయలేకపోయాడని వారు చెప్పారు. 36 ఏళ్ళ ఇతగాడు ప్రెషర్ కుకర్ లో రెండు బాంబులను దాచాడని, జన సమ్మర్ధ ప్రదేశాల్లో వాటిని పేల్చివేయాలనుకున్నాడని వారు వెల్లడించారు. ఐసిస్ టెర్రరిస్టులతో ఇతనికి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేదట. తన భార్య పేరిట, తన నలుగురు పిల్లల పేరిట అబూ యూసుఫ్ పాస్ పోర్టులు తీసుకున్నాడని, సిరియాలో మరణించిన ఉగ్రవాది యూసుఫ్ అల్ హింద్ ఇతని సహచరుడు, బాస్ కూడానని తెలిసింది.

సుమారు ఏడాది కాలంగా ఢిల్లీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇతనిపై నిఘా పెట్టినట్టు సమాచారం. అబూ యూసుఫ్ ని 7 రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ చేశారు. తదుపరి దర్యాప్తు కోసం ఇతడిని యూపీ లోని బలరాం పూర్ కి తరలించనున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us