AP CM Jagan: ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ

|

Jul 05, 2023 | 8:08 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను ప్రధాని ముందుంచినట్టు తెలుస్తోంది. ఈ ఆరు నెలల కాలంలో..

AP CM Jagan: ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ
CM Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను ప్రధాని ముందుంచినట్టు తెలుస్తోంది. ఈ ఆరు నెలల కాలంలో ప్రధానిని సీఎం జగన్‌ కలవడం ఇది మూడోసారి. విభజన హామీలు, ఆర్థిక సాయం, పెండింగ్‌ అంశాలపై ప్రధానితో చర్చించినట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని సీఎం కోరినట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర సర్కారు చేసిన నిధులను వెంటనే రీయింబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు, జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్దిదారుల గుర్తింపు, 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతి, కడప ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం APMDCకి ఇనుప గనుల కేటాయింపుల వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన సీఎం జగన్‌కు పార్టీ ఎంపీలు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం నేరుగా జన్‌పథ్‌లోని నివాసానికి చేరుకున్నారు. అలాగే మధ్యాహ్నం అమిత్‌ షాతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి వచ్చే ఫండ్స్‌పై జగన్‌ చర్చించినట్లు సమాచారం. హోం మంత్రి, ప్రధానితో భేటీ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఆర్థిక వ్యవహారాలు, బకాయిల గురంచి నిర్మలా సీతారామన్‌కు వివరించినట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి