MAadhaar APP: మీరు ఎంఆధార్‌ యాప్‌ వాడుతున్నారా..? అయితే వెంటనే డిలీట్‌ చేయమంటోన్న యూఐడీఏఐ..

|

Feb 09, 2021 | 10:56 PM

తాజాగా యూజర్లకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే క్రమంలో ఎంఆధార్ యాప్‌లో మార్పులు చేసింది. ఈ విషయాన్ని యూఐడీఏఐ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. మరిన్ని ఫీచర్ల కోసం..

MAadhaar APP: మీరు ఎంఆధార్‌ యాప్‌ వాడుతున్నారా..? అయితే వెంటనే డిలీట్‌ చేయమంటోన్న యూఐడీఏఐ..
Follow us on

Alert For MAadhaar APP: రేషన్‌ నుంచి మొదలు లోన్‌ల వరకు ఇలా అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు దగ్గరకావడానికి, ఆధార్‌ సేవలను మరింత సౌకర్యవంతంగా అందించేందుకు గాను యూఐడీఏఐ (UIDAI) టెక్నాలజీని సైతం వినియోగించుకుంటోంది.
ఈ క్రమంలోనే ఎంఆధార్‌ యాప్‌ను తీసుకొచ్చింది. తాజాగా యూజర్లకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే క్రమంలో యాప్‌లో మార్పులు చేసింది. ఈ విషయాన్ని యూఐడీఏఐ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. మరిన్ని ఫీచర్ల కోసం ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న యాప్‌ను డిలీట్‌ చేసి.. కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని ట్వీట్‌ చేశారు. ఇక 13 భాషల్లో అందుబాటులో ఉండనున్న ఈ యాప్‌తో 35 రకాల సేవలు ఆన్‌లైన్‌లో పొందొచ్చు. ఈ యాప్‌ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్, అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం, బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్‌తో పాటు మరిన్ని సేవలు వినియోగించుకోవచ్చు.

Also Read: Bar Code Scanner: మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా..? అయితే వెంటనే డిలీట్‌ చేయండి… ఎందుకో తెలుసా..?