గుడ్‌బై ఇండియా.. విమానం ఎక్కేముందు ఇద్దరు ప్యాసింజర్ల సంతోషం! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి ముందు ఇద్దరు బ్రిటీష్ పౌరులు తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. వారు విమాన ప్రయాణానికి ముందు ఆనందంగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
అహ్మాదాబాద్‌లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 241 మంది మృతి చెందారు. విమానంలో 242 మంది ఉండగా.. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారంతా మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది, 229 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ విమానం ఎక్కే ముందు ఓ ఇద్దరు బ్రిటీష్ పౌరులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
ఇండియా నుంచి ఇంగ్లండ్ వెళ్లిపోతున్నాం.. మరికొద్దిసేపట్లో విమానం ఎక్కేస్తాం.. గుడ్‌బై ఇండియా, చాలా చాలా సంతోషంగా ఉంది ఇంగ్లండ్ తిరిగి వెళ్తున్నందుకు అంటూ వీడియోలో చెప్పారు. కానీ, కొద్ది సేపటికి వారి ఆఖరి ప్రయాణం ముగిసింది. ఈ ఇద్దరు కూడా ప్రమాదంలో మృతి చెందారు. పాపం.. కొన్ని నిమిషాల ముందు ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లు.. అంతలోనే అగ్నికి ఆహుతి కావడం, వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

