ఇక దీదీ ఇలాకాలో.. ఎగరనున్న పతంగి

ఇప్పటి వరకు హైదరాబాద్, మహారాష్ట్రలో ఉన్న మజ్లీస్ పార్టీ.. అన్ని రాష్ట్రాల్లో పోటీచేసేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తోంది. గతంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా.. తగిన ప్రాభల్యం చూపట్టలేకపోయింది. మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బోణీ కొట్టింది. అయితే ఇప్పుడు.. రాబోయే ఎన్నికల్లో వెస్ట బెంగాల్‌లో కూడా బరిలోకి దిగేందుకు పావులుకదుపుతోంది. అయితే అక్కడ పార్టీకి ఎలాంటి క్యాడర్ లేకున్నా.. గట్టి పోటీ ఇవ్వగలమన్న ధీమాతో అడుగులువేస్తోంది. పోటీ గురించి ఏకంగా […]

ఇక దీదీ ఇలాకాలో.. ఎగరనున్న పతంగి

Edited By:

Updated on: Aug 02, 2019 | 3:43 AM

ఇప్పటి వరకు హైదరాబాద్, మహారాష్ట్రలో ఉన్న మజ్లీస్ పార్టీ.. అన్ని రాష్ట్రాల్లో పోటీచేసేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తోంది. గతంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా.. తగిన ప్రాభల్యం చూపట్టలేకపోయింది. మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బోణీ కొట్టింది. అయితే ఇప్పుడు.. రాబోయే ఎన్నికల్లో వెస్ట బెంగాల్‌లో కూడా బరిలోకి దిగేందుకు పావులుకదుపుతోంది. అయితే అక్కడ పార్టీకి ఎలాంటి క్యాడర్ లేకున్నా.. గట్టి పోటీ ఇవ్వగలమన్న ధీమాతో అడుగులువేస్తోంది. పోటీ గురించి ఏకంగా దీదీకే ట్వీట్ చేశారు కూడా. తమను రాజకీయ మిత్రులుగా పరిగణిస్తారా? లేక రాజకీయ శత్రువులుగా పరిగణిస్తారో తేల్చి చెప్పాలంటూ.. దీదీకి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మేము చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాం.. కానీ మమ్మల్ని టచ్ చేయడానికి ఎవరూ సాహసించరని.. మేము ఆటం బాంబులమంటూ ట్వీట్‌లో తెలిపారు. దీదీ.. మీతో మిత్రత్వం కలుపుకోడానికి సిద్ధంగానే ఉన్నాం. అలాగే శత్రుత్వమైనా సరే. మీరు మమ్మల్ని మిత్రులుగా చూస్తారా? లేక శత్రువులుగానా? అని ప్రశ్నించారు.